మీరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మాకేంటి ?, క్యూలో వచ్చి ఓటు వెయ్యండి !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైయ్యింది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. పలు ప్రాంతాల్లో నీరసంగానే ఓటింగ్ జరుగుతోంది. బెంగళూరు నగరంలో వానదేవుడు కరుణించడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉదయం 7 గంటల నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓటు వేస్తున్నారు.
తనకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంతకాలం నియోజక వర్గం తిరిగిన బీజేపీ అభ్యర్థికి ఓటర్లు చుక్కలు చూపించారు. మీకు ఓట్లు వేసి గెలిపించడానికి మేము కావాలి, మమ్మల్ని గాలికి వదిలేసి టింగురంగా అంటూ నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వెయ్యడానికి ప్రయత్నిస్తారా ? అంటూ మహిళా ఓటర్లు బీజేపీ అభ్యర్థికి సినిమా చూపించారు.

బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. క్రిష్ణప్ప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇన్ని రోజులు బీజేపీ కార్యకర్తలను వెంటపెట్టుకుని బెంగళూరు దక్షిణ నియోజక వర్గం మొత్తం తిరిగిన బీజేపీ లీడర్ ఎం. క్రిష్ణప్ప తనకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు మనవి చేశారు.
బుధవారం బెంగళూరు దక్షిణ నియోజక వర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో రౌండ్స్ వేసిన ఎం. క్రిష్ణప్ప తరువాత బనశంకరి రెండో స్టేజ్ లోని బూత్ నెంబర్ 145 దగ్గరకు వెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. క్రిష్ణప్ప ఇదే బూత్ లో ఓటు వెయ్యాల్సి ఉంది. అప్పటికే ఆ బూత్ లో ఓటర్లు బారులు తీరి ఓటు వెయ్యడానికి వేచి చూస్తున్నారు.
కారు దిగినేరుగా పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి ఎం. క్రిష్ణప్ప నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో చాలాసేపటి నుంచి క్యూలైన్ లో వేచి చూస్తున్న ఓటర్లు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. క్రిష్ణప్ప తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సార్ ఇన్ని రోజులు తనకు ఓటు వెయ్యాలని మా దగ్గరకు తిరిగారు. మీరు ప్రజాప్రతినిధి, ఓటర్లు క్యూలైన్ లో వెళ్లి ఓటు వెయ్యాలని మీరు ప్రజలకు చెప్పాలి, అలాంటిది మీరే క్యూలైన్ లో రాకుండా నేరుగా వెళ్లి ఓటు వెయ్యడానికి ప్రయత్నిస్తారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. క్రిష్ణప్పను నిలదీశారు. మీరుకూడా క్యూలో వచ్చి ఓటు వెయ్యాలని మహిళా ఓటర్లు డిమాండ్ చేశారు.
క్యూలో ఉన్న ఓటర్లను మచ్చిక చేసుకోవాల్సిన బీజేపీ అభ్యర్థి ఎం. క్రిష్ణప్పకు పోలింగ్ బూత్ కేంద్రంలో ఊహించని షాక్ తగలడంతో బిత్తరపోయారు. ఆ సందర్బంలో పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లకు, బీజేపీ అభ్యర్థి ఎం. క్రిష్ణప్పకు కొంతసేపే వాగ్వివాదం జరిగింది. ఎక్కడ వచ్చిన గొడవ అంటూ బీజేపీ అభ్యర్థి ఎం. క్రిష్ణప్ప తరువాత క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు.
మొత్తం మీద బీజేపీ అభ్యర్థి ఎం. క్రిష్ణప్పకు స్థానిక ఓటర్లు సినిమా చూపించడం హాట్ టాపిక్ అయ్యింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లో ఇదే బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఎం. క్రిష్ణప్ప ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎం. క్రిష్ణప్ప మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ కే. రమేష్ 30, 417 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications