గుండెకు గు'బిల్లు'.. రైతుకు రూ.222 కోట్ల కరెంట్ షాక్!
సాధారణంగా సామాన్యులకు కరెంట్ బిల్లు వందల్లో లేదా వేలల్లో వస్తే గుండె గుభేలుమంటుంది. అలాంటిది ఓ సామాన్య రైతుకు ఏకంగా రూ.222 కోట్ల బిల్లు వస్తే ఆ బిల్లు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. యూపీలోని నోయిడాలో విద్యుత్ శాఖ చేసిన ఓ భారీ తప్పిదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలు జరిగిందిదే?
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో గల చిపియానా ఖుర్ద్ గ్రామానికి చెందిన విపిన్ యాదవ్ అనే రైతులకు 1000 మీటర్ల స్థలం ఉంది. అక్కడ ఆయన 5 కిలోవాట్ల(5KW) కమర్షియల్ ఛార్జింగ్ కనెక్షన్ తీసుకున్నారు. విపిన్ యాదవ్ ప్రతి నెలా క్రమం తప్పకుండా తన విద్యుత్ బిల్లులను చెల్లిస్తుంటారు. అయితే తాజాగా ఆయనకు వచ్చిన బిల్లు చూసి విపిన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గత 7 నెలల బకాయి కింద ఏకంగా రూ.2,22,00,00,000 (222 కోట్లు) చెల్లించాలని ఆ బిల్లులో ఉంది.

అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
బిల్లు చూడగానే ఆందోళనతో విపిన్ యాదవ్ వెంటనే విద్యుత్ శాఖ కార్యాలయానికి పరుగులు తీశారు. అయితే మొదట్లో అక్కడి అధికారులు ఆయన ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ విద్యుత్ శిబిరంలో తన బిల్లును తనిఖీ చేయించగా.. సిస్టమ్‌లో కూడా రూ. 222 కోట్ల బకాయి ఉన్నట్లు చూపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆన్‌లైన్‌లో బిల్లు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే కేవలం మే నెలకు సంబంధించిన వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
సాంకేతిక లోపమే కారణం?
ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివం త్రిపాఠి వివరణ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఇలాంటి భారీ బిల్లులు జనరేట్ అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సాధారణంగా ఇటువంటి బిల్లులు సిస్టమ్‌లోనే 'హోల్డ్' అవుతాయని, వినియోగదారులకు వెళ్లకూడదని చెప్పారు. విపిన్ యాదవ్ బిల్లును సరిచేసి, అసలైన మొత్తంతో కూడిన కొత్త బిల్లును అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
టెక్నాలజీ పెరిగినప్పటికీ, ప్రభుత్వ విభాగాల్లో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే బాధితులు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications