Shock: ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు, మాజీ సైనికుడు, ఫస్ట్ భార్య విడాకులు, రెండో భార్య జంప్, ఇంట్లో ఫినిష్ !
బెంగళూరు: సైనికుడిగా ఉద్యోగం చేస్తున్న సమయంలో అతను కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్నాడు. భార్యతో అతను హ్యాపీగానే కాపురం చేశాడు. సైనికుడిగా రిటైడ్ అయిన తరువాత ఐటీ హబ్ లో నివాసం ఉంటూ భార్యతో కలిసి జీవించాడు. కొంతకాలం తరువాత దంపతుల మద్య తేడాలు రావడంతో మాజీ సైనికుడు, అతని భార్య విడాకులు తీసుకున్నారు. భార్యతో విడాకులు తీసుకున్న మాజీ సైనికుడు రెండో పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేశాడు. ఇటీవల రెండో భార్య కూడా మాజీ సైనికుడికి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయింది. ఇద్దరూ భార్యలు దూరం కావడంతో మాజీ సైనికుడు సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ప్రతిరోజు సమీపంలో ఉన్న బంధువులు మాజీ సైనికుడికి మూడు పూటలా భోజనం ఇచ్చి వెలుతున్నారు. భోజనం ఇవ్వడానికి ఇంటికి వెళ్లిన బంధువులు షాక్ అయ్యారు. ఇంట్లో మాజీ సైనికుడు దారుణ హత్యకు గురైనాడని తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు. నెల రోజుల ముందు ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య, ఆమెకు తెలిసిన వాళ్లు ఎవరైనా హత్య చేశారా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

మాజీ సైనికుడు
బెంగళూరులోని దోమ్మలూరులోని గౌతమ్ నగర్ లో సురేష్ అలియాస్ జూడో అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సైనికుడిగా ఉద్యోగం చేస్తున్న సమయంలో సురేష్ అతని కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్నాడు. భార్యతో సురేష్ హ్యాపీగానే కాపురం చేశాడు. సైనికుడిగా రిటైడ్ అయిన తరువాత ఐటీ హబ్ లో కాపురం ఉంటున్న సురేష్ అతని భార్యతో కలిసి జీవించాడు.

విడాకులు ఇచ్చేసిన మొదటి భార్య
కొంతకాలం తరువాత సురేష్ దంపతుల మద్య తేడాలు వచ్చాయి. మాజీ సైనికుడు అయిన సురేష్ వ్యాపారం చేస్తూ బెంగళూరులోనే ఉండిపోయాడు. రానురాను సరేష్ కు అతని భార్యకు గొడవలు ఎక్కువ అయ్యాయి. గొడవలు జరగడంతో మాజీ సైనికుడు సురేష్, అతని భార్య విడాకులు తీసుకున్నారు.

రెండో భార్య వెళ్లిపోయింది
భార్యతో విడాకులు తీసుకున్న మాజీ సైనికుడు సురేష్ కొన్ని సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. దోమ్మలూరులోని గౌతమ్ నగర్ లోనే సురేష్ అతని రెండో భార్యతో కాపురం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం రెండో భార్య కూడా మాజీ సైనికుడు సురేష్ కు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయింది. ఇద్దరు భార్యలు దూరం కావడంతో మాజీ సైనికుడు సురేష్ షాక్ అయ్యాడు.

మాజీ సైనికుడుకి అండగా ఉంటున్న బంధువులు
ఇద్దరూ భార్యలు దూరం కావడంతో మాజీ సైనికుడు సురేష్ గౌతమ్ నగర్ లోని అతని సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ప్రతిరోజు సమీపంలో ఉన్న బంధువులు మాజీ సైనికుడు సురేష్ కు మూడు పూటలా భోజనం ఇచ్చి వెలుతున్నారు. భోజనం ఇవ్వడానికి మాజీ సైనికుడు సురేష్ ఇంటికి వెళ్లిన బంధువులు షాక్ అయ్యారు.

మాజీ సైనికుడి దారుణ హత్య
ఇంట్లో మాజీ సైనికుడు సురేష్ దారుణ హత్యకు గురైనాడని తెలుసుకున్న అతని బంధువులు హెచ్ఏఎల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాజీ సైనికుడు సురేష్ హత్య విషయం తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు. నెల రోజుల ముందు ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య, ఆమెకు తెలిసిన వాళ్లు ఎవరైనా మాజీ సైనికుడు సురేష్ ను హత్య చేశారా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అంటూ బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. మాజీ సైనికుడు సురేష్ తల మీద బలమైనా ఆయుధాలతో దాడి చేశారని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications