వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవాలో బీజేపీకి షాక్.. స్వతంత్ర అభ్యర్థిగా డిప్యూటీ సీఎం భార్య పోటీ

|
Google Oneindia TeluguNews

గోవాలో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కకపోవడంతో పలువురు తిరుగుబావుటా ఎగురవేశారు. స్వతంత్రంగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ టెకెట్లు నిరాకరించిన వారిలో అందరూ కీలక నేతలే. వీరంతా కమలానికి పార్టీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది.

Recommended Video

Assembly Elections 2022: Opinion Poll హోరాహోరీ పోరే | ABP-CVoter | Oneindia Telugu
డిప్యూటీ సీఎం చంద్రకాంత్ కావ్లేకర్ భార్య సావిత్రి తిరుగుబాటు

డిప్యూటీ సీఎం చంద్రకాంత్ కావ్లేకర్ భార్య సావిత్రి తిరుగుబాటు


అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావాహులకు బీజేపీ అధిష్టానం టికెట్లు నిరాకరించింది. దీంతో సదరు ఆశావాహులు మంకుపట్టు పట్టి కూర్చున్నారు. అయినా అధిష్టానం ససేమిరా అనడంతో .. వారు రెబల్స్‌గా మారారు. కాషాయంతో తెగతెంపులు చేసుకున్నారు. గోవా డిప్యూటీ సీఎం చంద్రకాంత్ కావ్లేకర్ భార్య సావిత్రి బీజేపీ టికెట్ నిరాకరించింది . దీంతో ఆమె బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

క‌మ‌లానికి రాం రాం.. స్వ‌తంత్రంగా బ‌రిలోకి..

క‌మ‌లానికి రాం రాం.. స్వ‌తంత్రంగా బ‌రిలోకి..

అటు మాజీ మంత్రి దీపక్ పుష్కర్, డిప్యూటీ స్పీకర్ ఫెర్నాండెజ్‌ల కు కూడా భారతీయ జనతా పార్టీ టికెట్లు నిరాకరించింది. దీంతో వారు కమలంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు గోవా మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సెకర్‌కు కూడా కమలం మొండిచేయి చూపించింది. దీంతో ఆయన కూడా బీజేపీకి రాజీనామా చేశారు. పనిచేసేవారి బీజేపీలో చోటు లేదని మండిపడుతున్నారు. ల‌క్ష్మీకాంత్ స్వ‌తంత్రంగా పోటీచేసే దానిపై త‌న అనుచ‌రుల‌తో స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు.

ప‌నాజీ నుంచి ఇండిపెండెంట్‌గా.. ఉత్పల్ పారికర్

ప‌నాజీ నుంచి ఇండిపెండెంట్‌గా.. ఉత్పల్ పారికర్

మరో వైపు గోవా మాజీ సీఎం, కేంద్ర మంత్రి , దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ కూడా బీజేపీ టికెట్ కేటాయించలేదు. ఈనేపథ్యంలో ఆయన కూడా బీజేపీకి రాజీనామా చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పనాజీ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. కాగా తమ పార్టీ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే ఉత్ప‌ల్‌కు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఉత్పల్ పారికర్ స్వతంత్రంగానా లేదా ఆప్ పార్టీ నుంచా మరేదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై తీవ్రచర్చనీయాంశమైంది.

 ఫిబ్రవరి 14న పోలింగ్

ఫిబ్రవరి 14న పోలింగ్

గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో 34 నియోజకవర్గాలలో పోటీ చేయనున్న తమ పార్టీ అభ్యర్థుల జాబితాను గురువారం బీజేపీ ప్రకటించింది. గోవాలో ఫిబ్రవరి 14న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మార్చి 10న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలో తమ వ్యూహ ప్రతివ్యూహాలకు మరింత పదును పెట్టాయి.

English summary
Schok to Goa BJP,Deputy CM Chandrakant Kavlekar wife and 3 others contest as Idependentes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X