వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి షాక్: బెంగాల్ ఉప ఎన్నికల వేళ .. టీఎంసీలో చేరిన బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి బాబుల్ సుప్రియో

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి మరో షాక్ తగిలింది. బిజెపి సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీకి షాక్ ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగిన బాబుల్ సుప్రియో తనను మంత్రి వర్గం నుండి తప్పించటంతో తీవ్ర మనస్తాపానికి గురై భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. పశ్చిమ బెంగాల్ లో మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరిగిన తాజా పరిణామం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

బీజేపీకి షాకిచ్చి టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియో
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో శనివారం ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక పార్టీలోకి బాబుల్ ను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పని చేసిన అసన్సోల్ ఎంపీ బాబుల్ సుప్రియోను ఇటీవల మోడీ కేబినెట్ విస్తరణ సమయంలో మంత్రివర్గం నుండి తప్పించారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకు పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఊహించని విధంగా బాబుల్ బీజేపీకి గుడ్ బై చెప్పి ఉప ఎన్నికల సమయంలో టీఎంసీలో చేరడం ఆసక్తికరంగా మారింది.

Shock to BJP .. MP Babul Supriyo joined TMC during West Bengal by-election

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ బాబుల్ సుప్రియో .. ఉప ఎన్నికల సమయంలో బీజేపీకి షాక్
తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన తరువాత బాబుల్ సుప్రియో తనకు వచ్చిన అవకాశాన్ని బట్టి తాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా బిజెపి ప్రకటించిన జాబితాలో బాబుల్ సుప్రియో ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి షాక్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లో బిజెపి నుండి ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో ఇటీవల కాలంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదవ బిజెపి నాయకుడు . నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు మేలో బెనర్జీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకున్న తరువాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.

బీజేపీ నాయకులు టచ్ లో ఉన్నారు.. భవిష్యత్ లో మరింత మంది టీఎంసీ బాట : తృణమూల్ నేత
ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలపై తృణమూల్ నాయకుడు కునాల్ ఘోష్ ఈరోజు మాట్లాడుతూ బిజెపి నాయకులు పార్టీలో చేరడానికి చర్చలు జరుపుతున్నారని చెప్పారు. చాలా మంది బిజెపి నాయకులు తృణమూల్ నాయకత్వంతో కమ్యూనికేట్ చేస్తున్నారు. వారు బిజెపితో సంతృప్తి చెందలేదు. ఈరోజు బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు, మరొకరు రేపు చేరాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరెవరు బీజేపీకి గుడ్ బై చెప్తారో వేచి చూడండి అంటూ పేర్కొన్నారు.

బీజేపీపై వ్యతిరేకత తెలిసేలా టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియో
జూలైలో 43 మందితో కొత్త మంత్రివర్గాన్నినియమించడం ద్వారా కేంద్ర కేబినెట్‌ని రిఫ్రెష్ చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత సుప్రియో కలత చెందారు. ఆ రోజే ఆయన తాను ఆవేదన లో ఉన్నారని ట్వీట్ చేశారు. ఆపై ఆ పోస్టు ను తొలగించి తనపై ఎలాంటి అవినీతి మచ్చలేకుండా పదవి నుండి తప్పుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ మరో ట్వీట్ చేశారు. ఇక తాజాగా ఇంతకాలం బీజేపీ అధిష్టానం తనను మంత్రివర్గం నుండి తప్పించడంపై ఉన్న వ్యతిరేకతను బహిర్గతం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు బాబుల్ సుప్రియో.

English summary
Another shock for the BJP in West Bengal. BJP sitting MP Babul Supriyo has joined the Trinamool Congress party and shocked the BJP. Babul Supriyo, who resigned from the Union Cabinet, resigned from the Bharatiya Janata Party (BJP) out of remorse over his removal from the ministry. The latest development in the wake of the by-elections in three seats in West Bengal has now become a topic of discussion in Bengal politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X