షాక్: కోరిక తీర్చలేదని వైద్యుడిపై యాసిడ్ పోసింది
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఓ మహిళ.. వైద్యుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. దీంతో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. వైశాలికి చెందిన ఓ మహిళ(45).. పశువుల వైద్యుడు అమిత్ వర్మ(28)తో సంబంధాన్ని కోరుకుంటూ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తోంది.
తన కోరిక తీర్చాలని వర్మను వేధించడంతో అతడు నిరాకరించాడు. ఈ క్రమంలో సోమవారం అతని ఆస్పత్రికి వచ్చిన మహిళ.. నాలుగు లీటర్ల యాసిడ్‌ను అతనిపై కుమ్మరించింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

కాగా, వెంటనే నిందితురాలు అక్కడ్నుంచి పరారైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అమిత్ స్నేహితుడు.. అతడ్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. బాధితునికి 40శాతం గాయాలయ్యాయని, పొట్టమీద, ఛాతీపైన తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications