షాకయ్యే దారుణం: అంబులెన్స్ లో భర్తను తీసుకెళ్తున్న మహిళపై లైంగిక దాడి.. ఆపై
పుట్టెడు కష్టాలలో భర్త చావు బతికుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే, ఆసుపత్రికి తీసుకు వెళుతున్న ఓ మహిళ పైన అత్యాచారం చేసిన ఘటన.. ఆపై మహిళ వద్ద ఉన్న నగలు, డబ్బు ,మొబైల్ ఫోన్ చోరీ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సభ్య సమాజం షాక్ కు గురయ్యే ఈ ఘటన వివరాల్లోకి వెళితే
భర్తను అంబులెన్స్ లో తీసుకెళ్తున్న మహిళపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ నగర్ జిల్లాలో బన్సీ కొత్వాలీకి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది. అక్కడ ట్రీట్మెంట్ కోసం ఎక్కువ డబ్బులు అడగడంతో తిరిగి తన భర్తను వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకొని ఒక ప్రైవేటు అంబులెన్స్ మాట్లాడుకుంది. తన సోదరుడు అనూప్ సహాయంతో భర్తను అంబులెన్స్ లో తీసుకొని బయలుదేరిన మహిళ ఊహించని విధంగా అత్యాచారానికి గురైంది.

మహిళపై అంబులెన్స్ డ్రైవర్, హెల్పర్ లైంగిక దాడి
కొంత దూరం వెళ్లిన తర్వాత అంబులెన్స్ డ్రైవర్ అతని హెల్పర్ వెనక్కి వెళ్లి మహిళను వెహికల్ లోపల ముందు కూర్చోవాలని బెదిరించారు. దీంతో మహిళా డ్రైవర్ పక్క సీట్ లో కూర్చుంది. ఇక ఆపై డ్రైవర్, హెల్పర్ మహిళను లైంగికంగా వేధించారు. తనపై జరుగుతున్న లైంగిక దాడితో గట్టిగా మహిళ కేకలు వేయడంతో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో బస్తీ జిల్లాలోని ఓ ఏరియాలో అంబులెన్స్ ను ఆపారు.
మహిళను కొట్టి చోరీ, మహిళ భర్త మృతి
ఆపై ఆమె భర్త హరీష్ కు పెట్టిన ఆక్సిజన్ ను డిస్కనెక్ట్ చేశారు. మహిళను బెదిరించి కొట్టి ఆమె దగ్గరున్న బంగారు నగలు, 10000రూపాయల నగదు, ఫోన్ తీసుకుని వారిని అక్కడే వదిలేసి అంబులెన్స్ తో సహా ఉడాయించారు. బాధితురాలి సోదరుడు 112, 108 నెంబర్లకు కాల్ చేయగా 108సిబ్బంది వచ్చి హరీష్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సదరు మహిళా భర్త హరీష్ చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.
కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు
ఈ ఘటన పైన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఇటువంటి దారుణమైన ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ ఘటన తెలిసిన వారంతా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications