• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Shocking incident: 20 చక్రాల లారీ కింద ఆటో డ్రైవర్ ఏం చేశాడో చూడండి, వీడియో వైరల్ !

|

చెన్నై/ కాంచీపురం: కరోనా వైరస్ (COVID 19) వ్యాధి మహమ్మారి దెబ్బకు కొంత మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే మరి కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడం, మళ్లీ లాక్ డౌన్ అమలు కావడంతో ఇంట్లోనే ఉంటున్న ఓ ఆటో డ్రైవర్ ఉదయం టీ తాగడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లి హోటల్ దగ్గరకు వెళ్లాడు. టీ తాగుతున్న సమయంలో ఆటో డ్రైవర్ అటు వైపు వెలుతున్న 20 చక్రాల లారీ కింద పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసు అధికారులు అసలు విషయం తెలుసుకుని షాక్ కు గురైనారు. పోలీసుల విడుదల చేసిన ఈ క్లిప్పింగ్స్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

కరోనా దెబ్బకు మళ్లీ లాక్ డౌన్

కరోనా దెబ్బకు మళ్లీ లాక్ డౌన్

తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాధి నివారణకు చెన్నై సిటీతో పాటు కాంచీపురం, చెంగల్పట్టుతో సహ మొత్తం ఆరు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేశారు.

 అయోమయంలో ఆటో డ్రైవర్

అయోమయంలో ఆటో డ్రైవర్

తమిళనాడులోని కాంచీపురం జిల్లా, కుంద్రత్తూర్ లోని మెహతా ప్రాంతంలో రాజీ అనే ఆటో డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో చెన్నైతో పాటు కాంచీపురం జిల్లాలో ఒకేసారి లాక్ డౌన్ అమలు చేశారు. ఇదే సమయంలో ఆటో నడపడానికి అవకాశం లేకపోవడంతో కొన్ని రోజుల నుంచి రాజీ ఇంటికే పరిమితం అయ్యాడు.

నిద్రలేచి హోటల్ లో టీ తాగడానికి వెళ్లి !

నిద్రలేచి హోటల్ లో టీ తాగడానికి వెళ్లి !

కొన్ని రోజుల నుంచి రాజీ ఇంట్లో ఎవ్వరితో సరిగా మాట్లాడకుండా ఎక్కువ సమయం మౌనంగానే ఉంటున్నాడు. ఉదయం నిద్రలేచిన తరువాత రాజీ కుంద్రత్తూర్-అనకపుత్తూర్ మార్గంలోని ఓ టీ స్టాల్ లో టీ తాగడానికి వెళ్లాడు. టీ స్టాల్ లో ఉన్న వ్యక్తి టీ ఇవ్వడంతో రాజీ ఏదో ఆలోచిస్తూ టీ తాగుతున్నాడు.

20 చక్రాల లారీ కింద పడుకుని !

20 చక్రాల లారీ కింద పడుకుని !

రాజీ టీ తాగుతున్న సమయంలోనే కుంద్రత్తూర్- అనకపుత్తూర్ మార్గంలో నిధానంగా 20 చక్రాల హెవీ లారీ అటు వైపు వచ్చింది. అంత వరకు మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉన్న రాజీ ఒక్కసారిగా టీ గ్లాస్ పక్కనపెట్టి లారీ వైపు నడిచాడు. క్షణాలో ఒక్కసారిగా వెళ్లి లారీ వెనుక చక్రాల కిందపడుకోవడంతో రాజీ శరీరం నుజ్జునుజ్జు కావడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఏం జరిగింది ?

ఏం జరిగింది ?

లారీ కిందపడి రాజీ మరణించడాని, రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పూనమల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొదట పోలీసులు కూడా రోడ్డు ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేశారు. అయితే రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు షాక్ కు గురైనారు. లారీ ముందు చక్రాలు కిందకాకుండా వెనుక చక్రాల కింద రాజీ పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యింది.

  #WATCH Man Marries Both Lover and Bride Chosen by His Family Same Time Viral, Bizarre! || Oneindia
  ఆర్థిక సమస్యలా ? ఫ్యామిలీ సమస్యలా

  ఆర్థిక సమస్యలా ? ఫ్యామిలీ సమస్యలా

  రాజీ ఆత్మహత్య చేసుకున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ ను పోలీసులు విడుదల చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలతో రాజీ ఆత్మహత్య చేసుకున్నాడా ? కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా ? అనే విషయం దర్యాప్తు పూర్తి అయిన తరువాతే తెలుస్తుందని, కేసు విచారణలో ఉందని పూనమల్లి పోలీసులు తెలిపారు.

  English summary
  Shocking incident: CCTV footage has released on Kancheepuram auto drivers suicide case issue in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more