షాకింగ్ : నిరుద్యోగం, అప్పులతో 25వేల మందికి పైగా మృతి- 2018-20 మధ్య -రాజ్యసభలో కేంద్రం
దేశంలో ఎన్డీయే సర్కార్ హయాంలో అంతా అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్న ఎన్డీయే సర్కార్ ఇవాళ ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. దేశంలో ఇప్పటివరకూ అప్పులపాలై చనిపోతున్న రైతుల గురించి మాట్లాడుతుండగా.. ఇప్పుడు నిరుద్యోగం, అప్పుల కారణంగా భారీ ఎత్తున ప్రజలు చనిపోతున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాలు బయటపెట్టాయి.
2018-20 మధ్య కాలంలో భారత్ లో నిరుద్యోగం, అప్పుల కారణంగా దాదాపు 25 వేల మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు కేంద్రం ఇవాళ రాజ్యసభలో వెల్లడించింది. కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో నిరుద్యోగ సమస్యపై చర్చలో భాగంగా 2018-2020 మధ్యకాలంలో 25,000 మందికి పైగా భారతీయులు నిరుద్యోగం లేదా అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఈ కాలంలో దాదాపు 9,140 మంది ప్రజలు నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని, 16,091 మంది దివాలా లేదా అప్పుల కారణంగా మరణించారని ప్రభుత్వం ఎగువ సభకు తెలిపింది.

రాజ్యసభలో ఈ సభ్యుడు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా వివరాలు ఇచ్చారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) అందించిన డేటా ఆధారంగా ప్రభుత్వ గణాంకాలు ఉన్నాయని రాయ్ చెప్పారు.ఈ డేటాలో ఉన్న వివరాల ప్రకారం, 2020లో కోవిడ్ సంవత్సరంలో నిరుద్యోగులలో ఆత్మహత్యలు పెరిగాయి. అలాగే ఇవి 3548కి చేరుకుని గరిష్టస్ధాయిని కూడా తాకాయి. 2018లో 2,741 మంది నిరుద్యోగం కారణంగా జీవితాన్ని ముగించగా, 2019లో 2,851 మంది చనిపోయారు. అప్పుల విషయానికొస్తే ఈ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. అప్పుల కారణంగా దివాళా తీసి 2018లో 4970 మంది చనిపోగా... 2019లో ఇది మరింత పెరిగి 5908గా నమోదైంది. 2020లో అయితే అప్పుల కారణంగా చనిపోయిన వారి సంఖ్య స్వల్పంగా తగ్గి 5213గా నమోదైందని కేంద్ర నేర గణాంకాల బ్యూరో రికార్డుల్ని ఉటంకిస్తూ హోంశాఖ సహాయమంత్రి పేర్కొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications