Viral Video: చిన్న పిల్ల అని కూడా చూడకుండా..!

సమాజంలో రాను రాను మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు అధికం అవుతున్నాయి. చూడ్డానికి పెద్దవారుగా.. సమాజంలో గౌరవంగా కనిపిస్తారు. కానీ చేసేవి మాత్రం ఇలాంటి పనులు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మహిళలపై పడిపోతున్నారు మానవ మృగాళ్లు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ ప్యాసింజర్ ట్రైన్ లో పెద్ద వయసున్న ఓ వ్యక్తి.. కూతురి వయసున్న చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు డిమాండ్ చేస్తున్నారు.

Shocking Video Shames Nation Man Misbehaves with Young Girl on Train Sparks Online Fury

ఓ వ్యక్తి చూడ్డానికి పద్దతిగా ఉద్యోగస్థుడిగా ఉన్నాడు. కానీ అతడి చేష్టలు చూస్తే మాత్రం వీడ్ని ఏం చేసినా తప్పులేదు అనిపిస్తుంది. రైలులో ఓ బాలిక పక్కన కూర్చొన్న ఆ వ్యక్తి.. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఓ చేతితో తన బ్యాగు పట్టుకుని మరో చేతిని ఆ బాలికపై వేసి మృగంలా వ్యవహరించాడు. రైలులో వెనకాల సీట్లు ఖాళీగా ఉన్నా ఆ వ్యక్తి మాత్రం బాలిక వద్దకు వచ్చి కూర్చొన్నాడు. తనను ఇబ్బంది పెడుతున్నాడని గ్రహించిన ఆ బాలిక తన తల్లిపై పడుకుంది. ఈ కలిచివేసే దృశ్యాలను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు.

తనను వీడియో తీస్తున్నాడని గ్రహించిన ఆ వ్యక్తి .. వీడియో డిలీట్ చేయాలని ప్రాధేయపడ్డాడు. అందుకు ప్రయాణికులు ససేమిరా అనడంతో మెల్లగా అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలియాల్సి ఉంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతడ్ని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైల్లో వేయాలని కామెంట్స్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఆ వ్యక్తిని వెంటనే పట్టుకోవాలని పోస్టులు పెడుతున్నారు.బాలీవుడ్ నటి రీచా చద్దా ఈ ఘటనపై స్పందించారు. ఇదో సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. తక్షణమే అతడికి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+