సెక్స్ వర్కర్‌గా శ్వేతబసు ప్రసాద్.. ఈ సారి ఎలా అంటే..? విడాకుల తర్వాతే..
శ్వేతబసు ప్రసాద్ తెలుసు కదా.. కొత్త బంగారు లోకం మూవీతో ఫేం అయ్యారు. ఆ సినిమాలో ఆమె చెప్పే ఎక్కడ డైలాగ్ అప్పట్లో హాట్ టాపిక్. కానీ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు. వచ్చిన హిట్ కాలేదు. తర్వాత సెక్స్ రాకెట్‌లో ఇరుక్కోవడం ఆమె ప్రభ మసకబారిపోయింది. తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం.. ప్రేమ, పెళ్లి విడిపోవడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు ఆమె రిలాక్స్‌గా ఉన్నారు. జీవితంలో జరిగిన అటు పోట్లను గుర్తుచేసుకొని బాధపడటం లేదు. మళ్లీ సినిమాలపై ఫోకస్ చేశారు. వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. ఓ సినిమాలో సెక్స్ వర్కర్ పాత్ర పోషించడం సంచలనం రేపింది.

సెక్స్ రాకెట్‌లో ఇరుక్కొని..
శ్వేతబసు ప్రసాద్ ఇదివరకే సెక్స్ రాకెట్‌లో ఇరుక్కొగా.. ఇప్పుడు అదే పాత్ర చేయడం చర్చకు దారితీసింది. దీంతో ఆమె రియల్ లైఫ్‌లో జరిగిన పరిస్థితులు రీల్ లైఫ్‌లో కనిపిస్తాయా అనే ఊహాగానాలు నెలకొన్నాయి. దీనిపై ఆమె స్పందించలేదు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు శ్వేత. గతంలో జరిగిన ఘటనలను మరచిపోయానని చెబుతున్నారు. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న తామిద్దరం వీడిపోలేదు అని.. బ్రేకప్ తీసుకున్నామని చెప్పారు. అయితే వారిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని ఒక్కొక్కరు ఒకలా చెబుతున్నారు.

మధుర్ మూవీలో
ఇండియా లాక్ డౌన్ అనే సినిమాను మధుర్ బండార్కర్ రూపొందిస్తున్నారు. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ వల్ల జరిగిన పరిస్థితులను ఉదహరిస్తారు. ఇందులో సెక్స్ వర్కర్‌గా శ్వేతబసు నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ముంబై రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్ల దీనగాథను తెరకెక్కిస్తున్నారు. వారి సమస్యలను మధురుతో కలిసి తెలుసుకున్నారు శ్వేత. దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు.

వేశ్యలతో మంతనాలు
2 వారాల క్రితం కామాటిపుర వెళ్లామని శ్వేతబసు ప్రసాద్ ట్వీట్ చేశారు. వారి బాధను, పరిస్థితులను తెలుసుకున్నామని చెప్పారు. వారిని కలవడంతో జరిగిన ఘటనను స్వయంగా తెలుసుకునే అవకాశం కలిగిందని చెప్పారు. అలాగే వారు మాట్లాడే విధానాన్ని నేరుగా తెలుసుకున్నానని.. యాసను అర్థం చేసుకున్నానని తెలిపారు.