వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేధింపుపై ఎంపీ 'సారీ': శ్వేతా గంటల్లో ఫిర్యాదు వెనక్కి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shwetha Menon
కొచ్చి: ఓ కార్యక్రమంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కురుప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు చేసిన నటి శ్వేతా మీనన్ ఆదివారం సాయంత్రం తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఫిర్యాదు చేసిన గంటల్లోనే ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడం గమనార్హం.

ఎంపి పీతాంబర కురుప్ ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడంతో ఆమె వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన శ్వేతా మీనన్ వేరే వ్యక్తి వేధించినట్లుగా ఉన్న కొన్ని చిత్రాలను ఆధారాలుగా చూపించారని సమాచారం.

కాగా, ఎంపి పీతాంబర తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన ప్రముఖ నటి శ్వేతా మీనన్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కొచ్చిలో శ్వేతా మీనన్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు తీసుకున్నారు. కొల్లం నుండి ఆదివారం పోలీసు టీం కొచ్చికి వచ్చింది. టీంలో మహిళా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉన్నారు.

వీరు ఉదయం తొమ్మిది గంటలకు శ్వేత ఇంటికి వచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. రిపోర్టును బహిర్గతపర్చేందుకు పోలీసులు నిరాకరించారు. సమాచారం మేరకు శ్వేతా మీనన్... ఇద్దరి పేర్లను చెప్పినట్లుగా తెలుస్తోంది. అందులో ఎంపి కురుప్ పేరు ఉందని వార్తలు వచ్చాయి. కానీ మరో వ్యక్తి వేధించినట్లుగా ఆమె చిత్రాలను ఆధారాలుగా చూపినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి.

English summary
Actor Shwetha Menon on Sunday evening withdrew her complaint of molestation against MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X