బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ జైల్లో కొంచం కూడా తగ్గలేదు, అంబులెన్స్ లో ఆహారం, సహాయం చేస్తున్న అధికారి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ వీవీఐపీ సేవలు చేస్తున్నారని వెలుగు చూసింది.

జైల్లో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు: డీఐజీ రూపపై పరువునష్టం దావా: అన్నాడీఎంకే వార్నింగ్!జైల్లో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు: డీఐజీ రూపపై పరువునష్టం దావా: అన్నాడీఎంకే వార్నింగ్!

శశికళ వర్గీయులు ఎవ్వరూ జైలులోకి వెళ్లి ఆమెను కలవకపోయినా ఆమెకు కావాలసిన సౌకర్యాలు అందుతున్నాయని వెలుగు చూసింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఎస్ఐగా పని చేస్తున్న గజరాజ్ మాకనూర్ శశికళకు సేవలు చేస్తున్నారని విషయం బయటపడింది.

ఎస్ఐ గజరాజ్ పని ఏంటీ !

ఎస్ఐ గజరాజ్ పని ఏంటీ !

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో గజరాజ్ మాకనూర్ ఎస్ఐగా పని చేస్తున్నాడు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కలవడానికి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వెలితే అక్కడ ఉన్న రిజిస్టర్ లో సంతకం చేసి వారి పేర్లు, వివరాలు పొందుపరచాలి.

ప్రభుత్వ ఉద్యోగం చెయ్యలేదు

ప్రభుత్వ ఉద్యోగం చెయ్యలేదు

జైల్లో విజిటర్స్ రిజస్టర్ ఎస్ఐ గజరాజ్ మాకనూర్ దగ్గరే ఉంటుంది. ఆయనే విజిటర్స్ పేర్లు, వివరాలు నోట్ చేసుంటున్నారు. అయితే ప్రభుత్వం అప్పగించిన పని గురించి ఎస్ఐ గజరాజ్ మాకనూర్ తూతూ మంత్రంగా పట్టించుకుంటున్నాడని వెలుగు చూసింది.

చిన్నమ్మ దగ్గరకు డైరెక్ట్ గా వెళ్లిపోతారు

చిన్నమ్మ దగ్గరకు డైరెక్ట్ గా వెళ్లిపోతారు

శశికళను కలవడానికి వచ్చే వారి వివరాలు అక్కడ ఉన్న రిజిస్టర్ లో నోట్ చెయ్యకుండా ఎస్ ఐ గజేంద్ర మాకనూర్ నేరుగా చిన్నమ్మను కలవడానికి పంపించారని అధికారలు విచారణలో వెలుగు చూసింది. శశికళను కలిసిన వారిలో కనీసం 20 శాంతం మంది పేర్లు రిజస్టర్ లో నోట్ చెయ్యలేదని వెలుగు చూసింది.

డీఐజీ రూప దెబ్బతో!

డీఐజీ రూప దెబ్బతో!

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని డీఐజీ రూప బయటపెట్టిన విషయం తెలిసిందే. శశికళ వ్యవహారం బయటపడటంతో జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణరావ్ తో సహ డీఐజీ రూప తదితరులను బదిలి చేశారు.

వారం నుంచి చిన్నమ్మకు సేవలు

వారం నుంచి చిన్నమ్మకు సేవలు

శశికళ వ్యవహారంపై విచారణ జరుగుతున్న సందర్బంగా ఆమెకు గతంలో ఇచ్చిన వీవీఐపీ ట్రీట్ మెంట్ కు కత్తెరవేశారు. అయితే ఎస్ఐ గజరాజ్ గత వారం రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా శశికళకు కావాలసిన సేవలు చేస్తున్నారని వెలుగు చూసింది.

రాయల్ ఫుడ్

రాయల్ ఫుడ్

ప్రతి రోజు మూడు పూటల శశికళకు కావాలసిన అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) మద్యాహ్నం, రాత్రికి అవసరం అయిన భోజనంతో పాటు తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు, పెరుగు తదితర ఆహార పదార్థాలను ఎస్ఐ గజరాజ్ మాకనూర్ జైలు బయట నుంచి తెప్పిస్తున్నారుని వెలుగు చూసింది.

గుట్టుగా అంబులెన్స్ లో !

గుట్టుగా అంబులెన్స్ లో !

శశికళకు అవసరం అయిన ఆహార పద్దరాలు బయట నుంచి ఆంబులెన్స్ లో జైలు ఆవరణంలోకి వెలుతున్నాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది. శశికళ వర్గీయులు ఎస్ఐ గజరాజ్ మాకనూర్ ను బుట్టలో వేసుకుని శశికళకు కావాలసిన ఆహారపదార్థాలు బయట నుంచి పంపిస్తున్నారని అధికారుల విచారణలో బయటపడింది.

English summary
SI of Parappana Agrahara Prison Gajaraj Makanur has helped to bring food through ambulance for sasikala. An anonymous letter revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X