కాల్పులు జరిగినా.. గర్ల్స్ డ్యాన్స్ చేస్తూంటే ఎస్సై ఎంజాయ్, వేటు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: యువతులు డ్యాన్స్ చేస్తుండగా అదే పనిగా ఓ ఎస్సై చూస్తూ నిలుచుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. దీంతో సదరు ఎస్సై పైన సస్పెన్షన్ వేటు పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... రాంపూర్ కళా పోలీస్ స్టేషన్లో సీతారం స్వర్ణకర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. రాంపూర్ కళా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవంత్ పూర్ రేవాలిలో ఓ పార్టీకి ఎస్సై గురువారం నాడు హాజరయ్యాడు.

SI seen enjoying girls dance in video, suspended

అయితే, ఆ ప్రయివేటు పార్టీలో కొందరు యువతులు, యువకులు కలిసి డ్యాన్స్ చేశారు. అందులోని ఇద్దరు యువకులు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ చర్యను అడ్డుకొని, వారిని అదుపులోకి తీసుకోవాల్సిన ఎస్సై పట్టించుకోలేదు.

అతను మహిళల డ్యాన్స్ చూస్తూనే ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిందిత. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు. కాగా, కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి లైసెన్స్ ఉన్న తుపాకీ, మరో గన్ స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్సైని సస్పెండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A sub-inspector was today suspended after a video clip in which he is purportedly seen watching girls dance with some men indulging in celebratory firing at a function went viral on the social media.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి