రూ. 15 వేల కోట్ల నష్టం: చెన్నైకి అపన్న హస్తం (ఫోటోలు)

బెంగళూరు: భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్న తమిళనాడు ప్రజలను ఆదుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. చెన్నై ప్రజలను తక్షణం ఆదుకోవడానికి రూ. ఐదు కోట్ల పరిహారం ప్రకటించింది.

అదే విదంగా ఔషదాలు, నిత్యవసర వస్తువులు, ఆహారపదార్థాలు సరఫరా చెయ్యాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

తమిళనాడు ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి పూర్తి వివరాలు సేకరించాలని, వారికి ఏ విధంగా సహాయం చెయ్యాలి అని తెలుసుకుని ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారులకు సూచించారు.

15 వేల కోట్ల నష్టం

15 వేల కోట్ల నష్టం

భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నై నగరంతో పాటు తమిళనాడులో రూ. 15 వేల కోట్ల నష్టం జరిగిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

సగమే కనిపిస్తున్న మిద్దెలు

సగమే కనిపిస్తున్న మిద్దెలు

చెన్నై నగరంలో పలు ప్రాంతాలలో ఎటు చూసినా సగమే మిద్దెలు, వీదులు కనపడుతున్నాయి. రెండు అంతస్తుల భవనాలు సైతం మునిగిపోయాయి.

తెగిపడిన విద్యుత్ స్థంభాలు, వైర్లు

తెగిపడిన విద్యుత్ స్థంభాలు, వైర్లు

చెన్నై నగరంలోని అనేక ప్రాంతాలలో విద్యుత్ స్థంభాలు నేలమట్టం అయ్యాయి. వైర్లు తెగిపోయి నీట మునిగిపోయాయి.

అధికారికంగా 197 మంది

అధికారికంగా 197 మంది

తమిళనాడు ప్రభుత్వం వరదలు, భారీ వర్షాల కారణంగా 198 మంది మరణించారని ప్రకటించింది.

గల్లంతు అయ్యారు

గల్లంతు అయ్యారు

ఇప్పటికే చాల మంది వరదల కారణంగా గల్లంతు అయ్యారు. వారి ఆచూకి కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు.

49 సెంటిమీటర్లు

49 సెంటిమీటర్లు

బుధవారం రాత్రి చెంబరామ్ బాక్కమ్ లో 49 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

కునుకు లేకుండా చేస్తున్నాయి

కునుకు లేకుండా చేస్తున్నాయి

చెన్నై నగరంతో పాటు తమిళనాడులో వర్షాలు ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు పడుతున్నాయి.

అపన్న హస్తంకోసం ఎదురు చూపులు

అపన్న హస్తంకోసం ఎదురు చూపులు

చెన్నై నగర ప్రజలు అపన్న హస్తం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఔషదాలు, ఆహార పోట్లాల కోసం ఎదురు చూస్తున్నారు.

అధికారుల అగచాట్లు

అధికారుల అగచాట్లు

చెన్నై నగరంలో నీళ్లు తగ్గించడానికి అధికారులు నానా అగచాట్లు పడుతున్నారు. కార్పొరేషన్ సిబ్బంది శ్రమిస్తున్నారు.

కనిపించని మ్యాన్ హోల్స్

కనిపించని మ్యాన్ హోల్స్

పలు ప్రాంతాలలోని రోడ్ల పక్కన ఉన్న మ్యాన్ హోల్స్ కనపడకపోవడం, నీరు ఆరు అడుగుల ఎత్తులో నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురౌతున్నాయి.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+