కర్నాటక ప్రచారంలో టంగ్ స్లిప్: నరేంద్ర మోడీకి సిద్ధరామయ్య ప్రశంసలు
బెంగళూరు: కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేసిన పొరపాటును ఇప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని చెప్పబోయి బీజేపీ నేత యెడ్యూరప్పపై విమర్శలు చేశారు అమిత్ షా.
ఇప్పుడు సిద్ధరామయ్య స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర స్వామిని ప్రశంసించబోయి ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఆయన నాలుక స్లిప్ అయ్యింది. సిద్ధరామయ్య తమ పార్టీ నేత నరేంద్ర స్వామి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే నరేంద్ర స్వామి అనబోయి పొరపాటుగా నరేంద్ర మోడీ అన్నారు.

నరేంద్ర స్వామిని ప్రశంసించబోయి నరేంద్ర మోడీగా పేర్కొని ప్రశంసించారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఇళ్ల నిర్మాణం తదితర పనులు నరేంద్ర మోడీ, తమ ప్రభుత్వం వల్లే జరిగాయన్నారు.
వెంటనే స్వామి కలగజేసుకోవడంతో సిద్ధరామయ్య నాలుక కరుచుకుని సారీ సారీ.. నరేంద్ర స్వామి అన్నారు. నరేంద్ర అనే పదం ముఖ్యమైనదన్నారు. స్వామి ఇక్కడ ఉన్నారని, మోడీ గుజరాత్‌లో ఉన్నారని, నరేంద్ర మోడీ ఫిక్షన్, నరేంద్ర స్వామి నిజమని తప్పును సరిదిద్దుకున్నారు.
అంతకుముందు, ప్రచారంలో మోడీపై సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. మోడీ గొప్ప నటుడిలా చాలా బాగా ప్రసంగిస్తారని, అయితే ప్రసంగాలతో కడుపు నిండదన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేకుండా చేయాలనే అంశంలో ఆయన నిమగ్నమయ్యారని చెప్పారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications