కర్నాటకలో సీఎం మార్పు ? కీలక నిర్ణయం దిశగా కాంగ్రెస్ ..!

కర్నాటకలో గత ఎన్నికల్లో విజయంతో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తును తేల్చేందుకు ఆ పార్టీ సిద్దమవుతోంది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వర్గపోరు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇరువర్గాల నేతల్ని పిలిపించి మాట్లాడుతోంది. దీంతో కర్నాటక ప్రభుత్వ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.

డిసెంబర్1 న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో కాంగ్రెస్ పెద్దలంతా బిజీ అయిపోతారు. కాబట్టి ఆ లోపే కర్నాటకలో సీఎం మార్పు విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో సీఎంగా ఉన్న సిద్దరామయ్యను తప్పించి డీకే శివకుమార్ కు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు రాహుల్, సోనియా గాంధీ ఈ వ్యవహారంపై చర్చించేందుకు అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఢిల్లీ వెళ్తున్నారు.

Siddaramaiah vs DK Shivakumar Congress to Settle Karnataka CM Fight by December 1

రెండు రోజుల్లో సీఎం సిద్దరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరితో చర్చించాక సీఎం మార్పు విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. అయినా కేసుల కారణంగా డీకే శివకుమార్ ను చివరినిమిషంలో తప్పించి సిద్దరామయ్యకు సీఎంగా అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం సగం కాలం పూర్తి చేసుకోవడంతో సీఎంను మార్చాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Siddaramaiah vs DK Shivakumar Congress to Settle Karnataka CM Fight by December 1

రాష్ట్రంలో అధికార మార్పుపై కాంగ్రెస్ నేతల మధ్య, ముఖ్యంగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అయితే సిద్దరామయ్య మాత్రం అధిష్టానం తనను కొనసాగిస్తుందనే ధీమాలోనే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే డీకే శివకుమార్ కు అవకాశం ఇస్తే మంచిదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం సిద్దరామయ్యకు ఎలా నచ్చజెప్తుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. సిద్ధరామయ్యను కనీసం మార్చి వరకు కొనసాగించాలని ఆయన అనుచరులు పట్టుబడుతుండగా..కేబినెట్ ప్రక్షాళన జరిగినా శివకుమార్ మద్దతుదారుల్ని కొనసాగించాలని ఆయన వర్గం కోరుతోంది. దీంతో రాహుల్ తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+