Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంజాబ్ పీసీసీ చీఫ్‌గా కొనసాగుతా కానీ, నా షరతులకు ఓకే చెప్పాలి: నవజోత్ సింగ్ సిద్ధూ తేల్చేశారు

ఛండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీపై అసంతృప్తి పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. గత సెప్టెంబర్ నెలలో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలో కొత్త కేబినెట్ శాఖల కేటాయింపు అనంతరం అసంతృప్తితో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అయితే, సిద్ధూ రాజీనామాను మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తన పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమైంది కాదని, మళ్లీ పీసీసీ అధ్యక్ష పదని చేపడతానని పేర్కొన్నారు.

Sidhu Withdraws Resignation, Assures Congress Of 80-100 Seats In Punjab Polls, with conditions

అయితే కొత్త అడ్వకేట్ జనరల్, డీజీపీ నియామకం తర్వాతే తాను తిరిగి పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకుంటానని స్పష్టం చేశారు సిద్దూ. తన రాజీనామా నిర్ణయం వ్యక్తిగత ఇగోతో తీసుకున్నది కాదని, పంజాబీల ప్రయోజనం కోసమే అలా చేసినట్లు సిద్ధూ తెలిపారు. సీఎం చరణ్‌జిత్ చన్నీతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు.

తానేం చేసినా పంజాబ్ రాష్ట్రం కోసమేనని, పంజాబ్ తన ఆత్మ అని సిద్ధూ వ్యాఖ్యానించారు. గత నాలుగున్నరేళ్లుగా మద్యం, బస్సులు సమా అనేక అంశాలను లేవనెత్తినట్లు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్ అధికారులను తన చేతుల్లో పెట్టుకుని పనిచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పదవిపై తనకు ఎలాంటి ఆశా లేదని, పంజాబీల హక్కుల కోసం మాత్రమే తాను పోరాడతానని అన్నారు.

వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80 నుంచి 100 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి తాను కృసి చేస్తానని అన్నారు. కాగా, ప్రస్తుతం పంజాబ్ అడ్వోకేట్ జనరల్‌గా ఉన్న సీనియర్ న్యాయవాది ఏపీఎస్ డియోల్ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2015లో అప్పటి అకాళీదళ్ ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై కాల్పులు, మతపరమైన ఘటనలకు సంబంధించిన కేసుల్లో నిందితులైన మాజీ డీజీపీ సుమేధ్ సైనీ, మరో పోలీసు అధికారి తరపున వాదించిన డియోల్‌ని ఏజీగా నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సహోతాను కూడా తప్పించాలని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. సిద్ధూ ఆరోపణల నేపథ్యంలో ఏజీ పదవికి డియోల్ రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపినట్లు తెలిసింది. అయితే, సీఎం చన్నీ ఆ రాజీనామాను తిరస్కరించినట్లు సమాచారం.

Recommended Video

    Fuel Prices Drop : AP & TS ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే ₹100 లోపుకు చమురు ధరలు!! || Oneindia Telugu

    కాగా, సెప్టెంబర్ 28న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని సంభోదిస్తూ రాజీనామా లేఖ రాసిన సిద్ధూ... 'రాజీపడితే మనిషి వ్యక్తిత్వం కోల్పోతాడు. పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ సంక్షేమ ఎజెండా విషయంలోనూ నేను ఎన్నడూ రాజీపడేది లేదు. ఆ దృష్ట్యా పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సేవలు కొనసాగిస్తాను' అని సిద్ధూ పేర్కొన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. జులై 18న పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+