Sikkim assembly election results 2024: సిక్కిం కౌంటింగ్-భారీ విజయం దిశగా అధికార ఎస్కేఎం..!

ఈశాన్య రాష్ట్రం సిక్కిం అసెంబ్లీకి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. మొత్తం 32 సీట్లు ఉన్న సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తాజా సమాచారం మేరకు 29 సీట్లలో అధికార సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) ముందంజలో ఉంది. మరో సీటులో మాత్రమే ఎస్డీఎఫ్ ముందుంది. దీంతో ఇప్పటికే మెజార్టీకి అవసరమైన 17 సీట్లు దాటేసిన ఎస్కేఎం మరోసారి అధికారం చేపట్టడం ఖాయమైంది.

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీ చేసినా ఒక్క సీటు కూడా లభించే అవకాశం కనిపించడం లేదు. సిక్కిం ముఖ్యమంత్రి, ఎస్కేఎం అభ్యర్థి ప్రేమ్ సింగ్ తమాంగ్ తన సమీప ఎస్డీఎఫ్ ప్రత్యర్థి సోమ్ నాథ్ పౌడ్యాల్ కంటే దాదాపు 1,400 ఓట్ల ఆధిక్యంతో రెనాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మాజీ సిఎం, ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ నామ్‌చెయ్‌బంగ్ స్థానంలో ఎస్కేఎం అభ్యర్థి రాజు బస్నెట్ కంటే 546 ఓట్లతో వెనుకబడ్డారు.

Sikkim assembly election results 2024 ruling SKM all set to retain power crossed half way mark

రాష్ట్ర మంత్రి, ఎస్కేఎం అభ్యర్ధి సోనమ్ లామా సంఘాలో తన సమీప బీజేపీ ప్రత్యర్థి త్సేటెన్ తాషి భూటియాపై ఆధికంలో ఉన్నారు. చుజాచెన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్‌డిఎఫ్‌కు చెందిన మణి కుమార్ గురుంగ్‌పై సిక్కిం క్రాంతికారి మోర్చాకు చెందిన పురాణ్ కుమార్ గురుంగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గ్యాంగ్‌టక్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బీజేపీ అభ్యర్థి పెమా ఆంచల్ రిన్‌జింగ్‌పై ఎస్కేఎంకు చెందిన డిలే నామ్‌గ్యాల్ బర్ఫుంగ్పా కూడా 1,053 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాసేపట్లో పూర్తి ఫలితాలు రాబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+