లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం-బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్ పై పోరాటం
బాలీవుడ్ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి విషమించింది. కొంతకాలంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కోలుకున్నట్లు కనిపించారు. కానీ తిరిగి ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆమెను బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలోనే ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
గత నెలలో లత ఆరోగ్యంలో కొంత మెరుగుపడిన తర్వాత ఆమె కోలుకుంటున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. కానీ తిరిగి ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో ఆమె బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో ఆమె కుటుంబసభ్యులతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది జనవరి 8న లతా మంగేష్కర్ కు కోవిడ్-19కి పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేర్చారు. ఆ తర్వాత కోలుకున్నా తిరిగి ఆరోగ్యం విషమించింది. ఆమె తాజా ఆరోగ్య పరిస్ధితిపై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూస్తే "లతా దీదీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆమె ఇప్పటికీ ICUలో ఉంది . డాక్టర్ పర్యవేక్షణలో ఉంటోంది. గత 27 రోజులుగా, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గత నెలలో, లతా మంగేష్కర్ పరిస్దితి కాస్త మెరుగుపడ్డ సంకేతాలు కనిపించాయి. ప్రస్తుతం పరిస్ధితి విషమించింది. డాక్టర్ ప్రతీత్ సమదానీ నేతృత్వంలోని వైద్యుల బృందం పరిశీలనలో ఆమె ప్రస్తుతం ఉన్నట్లు తెలిపారు.
Recommended Video
అయితే లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్యంపై పుకార్లు వ్యాపించాయి. కొన్ని రోజుల క్రితం, లతా మంగేష్కర్ బృందం తప్పుడు నివేదికలను పట్టించుకోవద్దని శ్రేయోభిలాషులను హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. జనవరి 21న వారు విడుదల చేసిన ప్రకటనలో "సిన్సియర్ అప్పీల్. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలను గాలికి వదిలేయకండి. లతా దీదీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు, డాక్టర్ ప్రతీత్ సమదానీ, ఆయన బృందం చికిత్స అందిస్తోంది. లతా దీదీ త్వరగా కోలుకోవాలని, ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిద్దామని కోరింది.












Click it and Unblock the Notifications