Sir Creek Tensions: పాక్ కు కేంద్రం బిగ్ వార్నింగ్- తేడా వస్తే మళ్లీ యుద్దమే..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. దీని దెబ్బకు పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరడం, భారత్ అంగీకరించడం జరిగిపోయాయి. అయితే ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ తిరిగి సరిహద్దుల వద్ద రెచ్చగొట్టే చర్యలకు దిగుతుండటం భారత్ కు ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సర్ క్రీక్ సరిహద్దుల వద్ద పాక్ కవ్వింపు చర్యలపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ తీవ్రంగా స్పందించారు.

సర్ క్రీక్ ప్రాంతం వైపు దురాక్రమణకు పాల్పడితే దానికి ఘోరమైన ప్రతిస్పందన తప్పదని అది చరిత్ర, భౌగోళిక స్థితిని మార్చగలదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. గుజరాత్‌లోని భుజ్ సరిహద్దు నగరానికి సమీపంలోని సైనిక స్థావరంలో సైనికులతో కలిసి దసరా వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా రాజ్ నాథ్ ఆయుధ పూజ కూడా నిర్వహించారు.

Sir Creek Tensions Rise India Warns Pakistan Against Aggressive Moves

ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలన్నింటినీ భారత సైన్యం విజయవంతంగా సాధించిందని, పరిస్థితిని తీవ్రతరం చేయడం ద్వారా పాకిస్తాన్‌తో యుద్ధం ప్రారంభించడం దాని లక్ష్యం కాదని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. 1965 యుద్ధంలో భారత సైన్యం లాహోర్‌కు చేరుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, ఇవాళ కరాచీకి వెళ్లే ఒక మార్గం ఈ క్రీక్ గుండా వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని రాజ్ నాథ్ హెచ్చరించారు.

Sir Creek Tensions Rise India Warns Pakistan Against Aggressive Moves

స్వాతంత్రం సాధించి 78 సంవత్సరాలు గడిచినా సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దుపై వివాదం కొనసాగుతోంది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి భారత్ ప్రయత్నాలు చేసినా పాకిస్తాన్ సహకరించడం లేదు. తాజాగా సర్ క్రీక్ వెంబడి సైనిక సదుపాయాల్ని విస్తరించేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించి ఇవాళ హెచ్చరికలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+