
సోదరుడి పెళ్ళిలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన సోదరి.. ఒక్కసారిగా అందరిలో భావోద్వేగం; వీడియో వైరల్!!
సోదరుడి పెళ్లిలో ఒక సోదరి సడన్ సర్ప్రైజ్ వచ్చింది. మొదట పెళ్లికి తను రావడానికి కుదరదని చెప్పినప్పటికీ ఎవరికీ చెప్పకుండా వచ్చి పెళ్లిలో అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. రాదనుకున్న కూతుర్ని చూసిన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై కుమార్తెను గట్టిగా హత్తుకున్నారు. ఇక తన పెళ్లికి రాదని భావించిన సోదరుడు తన సోదరి తన పెళ్లికి రావడంతో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
క్యాన్సర్ పేషెంట్ ల కోసం హైదరాబాదీ హెయిర్ స్టైలిస్ట్ ఔదార్యం .. ఏం చేస్తున్నారంటే!
సోదరుడి పెళ్ళికి రాలేనన్న సోదరి.. కానీ ఏం చేశారంటే
ఇటీవల యూకేలో స్థిరపడిన శ్రద్ధ షెలార్ అనే యువతి తాను వెళ్ళిన కొద్దిరోజులకే తన సోదరుడి పెళ్లి నిశ్చయం కావటంతో పెళ్లికి రాలేనని చెప్పారు. కానీ తనకు అన్నిటికంటే ఫ్యామిలీనే ఎక్కువ అని భావించిన సదరు యువతి, ఎలాగైనా పెళ్లికి వెళ్లి తన సోదరుని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. దీంతో యూకే నుండి ఇండియాకు బయలుదేరి పెళ్లి జరుగుతున్న సమయంలో మండపం వద్ద ప్రత్యక్షమయ్యారు. ఇంక అంతే వారి కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. ఇక తల్లిదండ్రుల ఆనందానికైతే పట్టపగ్గాలు లేవు.

ఫ్యామిలీ తర్వాతే ఏదైనా .. పోస్ట్ పెట్టిన సోదరి వీడియో వైరల్
పెళ్లి పీటల మీద కూర్చున్న సోదరుడు కూడా సోదరిని చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఆత్మీయ ఆలింగనాలతో ఆమెను ముంచెత్తారు. కుటుంబ సభ్యుల భావోద్వేగాలతో నిండిన ఈ వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో ఆమె ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. కుటుంబంతో సంతోషంగా గడిపే సమయాలను మిస్ చేసుకోవద్దని, అవి చాలా విలువైనవని ఆమె తన వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో మూడు లక్షల వీక్షణలు 42,000 లైకులను సొంతం చేసుకుంది. అయితే ఈ వీడియో చూసిన వీక్షకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తున్న పరిస్థితి ఉంది. కొందరు సోదరుడుపై యువతికి ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలం అంటూ ట్వీట్ చేస్తే, మరికొందరు పెళ్లి చేసుకుంటున్న కొత్తజంట పైనుండి అందరి దృష్టిని తన వైపుకు యూకే నుంచి వచ్చిన సోదరి మరల్చుకున్నారు అని.. కొత్తజంట విషయంలో పాపం అంటూ స్పందించారు.

సోదరుడి పెళ్ళికి సోదరి ఇచ్చిన బహుమానం
ఇంకొందరు వీడియోలో కనిపించిన కుటుంబ సభ్యుల అనుబంధం, వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ కంటతడి పెట్టించిందని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఒక భావోద్వేగంతో నిండిన వీడియో తన సోదరుడు పెళ్లికి సోదరి బహుమానంగా ఇచ్చిందని భావిస్తున్న వారు లేకపోలేదు. అసలు పెళ్లి కంటే ఆమె పెళ్ళికి సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చెయ్యటమే హైలెట్ అయ్యింది అంటూ చెప్తున్నారు.