Sister in law: వయ్యారాల వదినతో లింక్, మేడమ్ మాత్రం అందరితో వన్స్ మోర్, రోడ్డులో !
చెన్నై/ వేలూరు: వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని కారణాల వలన భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ నివాసం ఉంటున్నది. మహిళ చెల్లికి పెళ్లి అయిపోయింది. ఇంటికి వచ్చి వెలుతున్న చెల్లెలి భర్తతో మహిళ చనువు పెంచుకుంది. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళతో ఆమె మరిది అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చెల్లెలి భర్తతో వదిన అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అయితే తన వదిన నాతో అన్నట్లే అనేక మందితో వన్స్ మోర్ అని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న మరిది రగిలిపోవడంతో కథ అడ్డం తిరిగింది.

భర్త చనిపోయాడు
తమిళనాడులోని వేలూరు జిల్లాలోని రాణిపేట్ జిల్లాలోని సోలింగర్ సమీపంలోని తకరకుప్పం పంచాయతీలోని ఒట్టెనేరి గ్రామంలోని రామ్ కోయిల్ వీధిలో మునిస్వామి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మునిస్వామి గౌతమి (34) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మునిస్వామి, గౌతమి ఈ దంపతులకు భవానీ(9), నరసింహన్(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మునుసామి అనారోగ్యంతో 3 సంవత్సరాల క్రితం మరణించాడు.

ఒంటరిగా ఉంటున్న మహిళ
గౌతమి రాణిపేటలోని చిప్ కాట్ (తమిళనాడులో ఇండస్ట్రియల్ ఏరియాలను ఇలాగే పిలుస్తారు)లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఆమె పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఎప్పటిలాగే ఉదయం గౌతమని కంపెనీలో పనికి వెళ్లింది. సాయంత్రం వరకు కంపెనీలో ఉన్న గౌతమి పని ముగించుకుని స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరింది. తరువాత గౌతమికి ఓవ్యక్తి ఎదురుపడటంతో ఆమె అక్కడే ఆగిపోయింది.

ఇనుపరాడ్ తో దాడి
ఒట్టేరి హిల్యాడి ప్రాంతంలోకి బైక్ లో వెళ్లిన ఓ మర్మాంగుడు గౌతమితో మాట్లాడి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో యువకుడితో గౌతమికి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన యువకుడు అతని వెంట తీసుకెళ్లిన ఇనుప రాడ్డు తీసుకుని రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుతున్న గౌతమిపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.

మహిళ ఫ్రెండ్ మీద దాడి
గౌతమి తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడే రక్తపుమడుగులో స్పృహతప్పి అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన గౌతమి స్నేహితుడి మీద ఆయువకుడు దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలైనాయి. సమాచారం అందుకున్న సోలింగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మురుకానందం, పోలీసులు తీవ్రంగా గాయపడిన మహిళను వాలాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గౌతమి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు.

మరిదితో లింక్
అరక్కోణం అసిస్టెంట్ పోలీస్ ఇన్ స్పెక్టర్ యాదవ్ గిరీష్ అశోక్ వచ్చి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భర్తను కోల్పోయిన గౌతమి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇనుప దుకాణంలో పనిచేసే తన చెల్లెలు ప్రియా భర్త సంజీవిరాయన్ (28)తో చనువు పెంచుకుందని వెలుగు చూసింది. రానురాను గౌతమి ఆమె చెల్లెలు ప్రియా భర్త సంజీవరాయన్ తో కలిసి తిరుగుతూ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని వెలుగు చూసింది.

గౌతమికి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువే
మరిది సంజీవరాయన్ తో ఎంజాయ్ చేస్తున్న గౌతమి ఆమె పని చేస్తున్న కొందరితో, ఇంటి దగ్గర మరికొందరు మగవాళ్లతో చనువు పెంచుకుని వారితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న సంజీవిరాయన్ రగిలిపోయాడని పోలీసులు అన్నారు. ఇదే విషయంలో గౌతమితో సంజీవిరాయన్ తరచూ గొడవపడుతున్నాడని తెలిసింది.

చెప్పినట్లు చంపేశాడు
పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేస్తానని ఇప్పటికే సంజీవరాయన్ అతని వదిన గౌతమికి వార్నింగ్ ఇచ్చాడు. ఇంత జరిగినా గౌతమి తన తీరు మార్చుకోలేదని దు.సంజీవరాయన్ ఇంకా రగిలిపోయాడు. చెల్లెలు ప్రియా భర్త సంజీవరాయన్ తన విలాలసాలకు అడ్డుపడుతున్నాడని గౌతమి అతని తో మాట్లాడటం మానేసింది. డిసెంబర్ 31వ తేదీన రాత్రి ఇంటికి వెలుతున్న గౌతమిని అడ్డగించిన సంజీవరాయన్ ఆమెతో గొడవని ఇనుపరాడ్ తో ఆమెతో పాటు మరో మహిళ మీద దాడి చేశాడని పోలీసులు సోమవారం చెప్పారు.

చెల్లెలి జీవితం నాశనం
అక్రమ సంబంధం కారణ:గా గౌతమిని హత్య చేసిన ఆమె మరిది సంజీవీరాయన్ తప్పించుకుని పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం కారణంగా గౌతమి హత్యకు గురికావడమే కాకుండా ఆమె చెల్లెలు ప్రియా జీవితం కూడా నాశనం కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications