పెళ్లాంటూ శీలాన్ని శంకించినందుకు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటామని చెప్పి, తర్వాత శీలాన్ని శంకించడంతో అవమానాన్ని భరించలేక ఇద్దరు అక్కాచెల్లెళ్లు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. వీరిని కాపాడడానికి ప్రయత్నించారు. అయితే వారిలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన అఫ్జల్‌గఢ్ ప్రాంతంలోని ఆలంపూర్ గోన్రి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అక్కచెల్లెళ్ళు ఇద్దరూ భాగిజోట్ గ్రామానికి చెందిన ఫైజల్, నౌమన్‌లతో ప్రేమ వ్యవహారం ఉందని చెప్పారు. ఈ రెండు జంటలూ గ్రామం నుంచి వెళ్లిపోయి పది రోజుల తర్వాత తిరిగొచ్చారు.

యువతులను పెళ్లి చేసుకోవాలని కుల పెద్దలు యువకులను కోరడంతో, యువకుల పెద్దలు గ్రామానికి వచ్చి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అంతేకాకుండా యువతుల శీలాన్ని ప్రశ్నించడంతో అవమానాన్ని భరించలేక అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
వీరిని కాపాడేలోపే ఒకరు మరణించడంతో, గాయాలతో ఉన్న మరో సోదరిని ఆసుపత్రికి తరలించారు. యువతుల ఆత్మహత్యకు కారకులైన ఇద్దరు యువకుల కోసం గాలింపు జరుగుతోందని అఫ్జల్‌గఢ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేశ్‌పాల్‌సింగ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications