ఒక్కరు కాదు ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదస్థితిలో, మృత్యువాత
ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గంజాం జిల్లాలోని మాటియా బోరి గ్రామానికి చెందిన వీరు తురుబండిలో గల తాతయ్య వద్ద ఉంటున్నారు. బాలికల అమ్మ, నాన్న సొంత గ్రామంలో రోజువారీ కూలీ పనులు చేసుకుంటున్నారు. తురుబండిలో ఉన్న వీరు శుక్రవారం అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది.

శుక్రవారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఎల్ తిటికా రెడ్డి, ఎల్ సోమరెడ్డి చనిపోయారు. ఎల్ బర్షారెడ్డిని మాత్రం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లిన తర్వాత మృతిచెందారు. తిటికా, సోమరెడ్డి మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. శుక్రవారం వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి తిటికా, సోమ వెళలిపోయారు. బర్షాను మాత్రం ఆస్పత్రికి తరలించగా చనిపోయారు.
అక్కాచెల్లెళ్ల మృతికి కారణం, వారు నిద్రిస్తోన్న గదిలో పెస్టిసైడ్స్ ఉండటమే కారణం కావొచ్చని స్థానికులు చెప్తున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదక వచ్చాక కారణం ఏంటో తెలుస్తోందని పోలీసులు చెప్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications