రేప్ కేసు: బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్, సిట్ విచారణకు ఆదేశం..

Subscribe to Oneindia Telugu
  Unnao Case: 'Case Will Form SIT To Probe' Says ADG

  లక్నో: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌పై ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. కుల్దీప్ సింగ్‌తో పాటు బాధితురాలి తండ్రి చావుకు కారణమైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తమ్ముడిపై సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణకు ఆదేశించింది.

  అడిషనల్ డీజీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుందని తెలిపారు. కాగా, బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోయిన నేపథ్యంలో.. దానిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్ తమ్ముడు అతుల్ సింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

  SIT to Probe Unnao Rape, BJP MLAs Brother Arrested for Death of Victims Father

  రాష్ట్ర పోలీస్ చీఫ్ ఆదేశాల మేరకే అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీస్ వర్గాలుతెలిపాయి.

  ఇదిలా ఉంటే, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ అతని సోదరులు కలిసి తనపై అత్యాచారం చేసినట్టు 18ఏళ్ల ఓ యువతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

  ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8న సీఎం ఇంటి ఎదుట ఆమె ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన జరిగిన రోజే ఆమె తండ్రి పప్పు సింగ్(50) పోలీస్ కస్టడీలో మరణించాడు. జైలు నుంచి అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  కాగా, ఏప్రిల్ 5వ తేదీన మారణాయుధాలు కలిగి ఉన్నాడన్న కారణంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అప్పటికే ఎమ్మెల్యే కుల్దీప్ సోదరుడు అనిల్ సింగ్ అతనిపై దాడికి పాల్పడ్డాడు.

  పప్పు సింగ్‌ను కొట్టినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోను, వినిత్, శైలు అనే ముగ్గురిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 4వ తేదీనే వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ పప్పు సింగ్ చనిపోయాక వారిని అరెస్ట్ చేయడం గమనార్హం. పప్పు సింగ్ అలియాస్ సురేంద్ర సింగ్ భార్య ఆశా సింగ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. పప్పు సింగ్ మృతితో మఖీ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అశోక్ కుమార్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Uttar Pradesh police has said that a special investigation team (SIT) has been constituted to probe into Unnao rape case involving BJP MLA and the death of victim's father.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి