మద్యం తాగించి 6గురు మహిళలపై గ్యాంగ్‌రేప్: అరెస్ట్

వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులు నీల్నిధి సింగ్, జై ప్రకాశ్ సింగ్, జగ్గు పాండేలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పనికిరాని వస్తువులను అమ్ముకుని జీవించే బాధిత యువతులు, మహిళలు.. చెత్త, పనికి రాని వస్తువులను కొనుగోలు చేసే వ్యాపారి అయిన నీల్నిధి వద్దకు వెళ్లారు. వారు సేకరించిన వస్తువులను నీల్నిధికి బుధవారం సాయంత్రం అతనికి అమ్మారు.
డబ్బు ఇచ్చేందుకు కొంత సేపు వేచి ఉండాలని అతడు కోరడంతో వారు అక్కడే ఉండిపోయారు. బాగా రాత్రి అయితే ఆటో ఛార్జీలు కూడా ఇచ్చి పంపుతానని చెప్పాడు. రాత్రి అయిన తర్వాత ఆరుగురు మహిళలను తుపాకీతో బెదిరించి తన గోడౌన్‌లోనే బంధించాడు. ఆ తర్వాత ఆ మహిళలకు మద్యాన్ని తాగించారు.
ఆ తర్వాత జైప్రకాశ్ సింగ్, జగ్గు పాండేలతో కలిసి నీల్నిధి సింగ్ వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక ఆ మహిళలతో పాటు ఉన్న ఇద్దరు ఆరేళ్ల బాలురను చితకబాదారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించి పంపించేశారు.
కాగా, గురువారం బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications