రాష్ట్రానికి 7వ వేతన సంఘం వర్తింపు

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రినరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. హల్దియాలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్ పై హామీల వర్షాన్నికురిపించారు. ఆరు అత్యంత కీలకమైన గ్యారెంటీలను ప్రకటించారు. ప్రజలకు పూర్తి జవాబుదారీతనం గల పాలన, చట్టబద్ధతపై విశ్వాసం పునరుద్ధరణ దీని లక్ష్యమని ఆయన వివరించారు. 7వ వేతన సంఘం అమలు, తృణమూల్ పాలనలోని అవినీతి, కుంభకోణాలు, మహిళలపై నేర కేసుల తిరిగి తెరవడం వంటివి ఉన్నాయి.

మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గూండాయిజంగా అభివర్ణించారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ ఒక్క తృణమూల్ గూండా కూడా చట్టం నుండి తప్పించుకోలేడని హెచ్చరించారు. ఆరు హామీల్లో మొదటిది- తమ ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని నిర్మూలిస్తుందని మోదీ చెప్పారు. చట్టంపై విశ్వాసం, బాధితుతలకు సత్వర న్యాయం, న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు.

Six Guarantees for West Bengal Modi Hints at 7th Pay Commission and Action Against TMC Corruption

తమ ప్రభుత్వ హయాంలో, పాలనా యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా, పూర్తిగా బాధ్యతాయుతంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. తృణమూల్ మాదిరి కాకుండా పారదర్శక పరిపాలన అందిస్తామని, బెంగాల్ ప్రజలకు ఇప్పుడు ఇదే తక్షణ అవసరమని అన్నారు. ప్రతి రాజ్యంగా వ్యవస్థ కూడా జవాబుదారీతనంగా వ్యవహరించేలా చూస్తామని హామీ ఇచ్చారాయన.

ప్రతి కుంభకోణం, అవినీతి, ఆడబిడ్డలపై అన్యాయం, అత్యాచార కేసుల ఫైళ్లన్నింటినీ కూడా తిరిగి తెరుస్తామనే మూడో హామీ ఇస్తోన్నానని మోదీ స్పష్టం చేశారు. తృణమూల్ పాలనలో అవినీతికి పాల్పడిన వారందరూ జైలుకు వెళ్తారని, మంత్రి అయినా, వాచ్‌మెన్ అయినా, చట్టం అందరినీ బాధ్యులను చేస్తుందని తేల్చి చెప్పారు. ఏ తృణమూల్ గూండా కూడా చట్టం నుండి తప్పించుకోలేడనే హామీ ఇస్తున్నానని మోదీ తెలిపారు.

శరణార్థులకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రతి హక్కు, ఆధికారం కల్పిస్తామని అయిదో హామీగా ప్రకటించారు మోదీ. చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతామని, దేశంలో ఉండటానికి వారికి ఎప్పటికీ అనుమతించబోమని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రస్థాయిలో ఏడోవ వేతన సంఘాన్ని అమలు చేస్తామని, ప్రతి ఉద్యోగికీ దాని ఫలాలు అందేలా చేస్తామని చెప్పారు. ఇది తానిచ్చే ఆరో గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని, ముఖ్యమంత్రి కలిసి పనిచేయడం అత్యవసరమని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+