అరగంటలో 6 విమానాలకు బెదిరింపు కాల్స్-ప్రయాణికుల గగ్గోలు..!
భారత్ లో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇప్పటికే నెల రోజులుగా వివిధ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో పలు విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తోంది. ఇవాళ కూడా కేవలం అరగంట గ్యాప్ లోనే ఆరు విమానాలకు ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అధికారులు పరుగులు పెట్టారు. అలాగే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
గత 30 నిమిషాల్లో 3 భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 6 విమానాలు స్క్వాక్ చేశాయని ఫ్లైట్ రాడార్ ఎక్స్ హ్యాండిల్ నివేదించింది. ఈ నెలలో భారతీయ విమానయాన సంస్థలు పెద్ద సంఖ్యలో ఇలా ఫేక్ బాంబు బెదిరింపులకు గురయ్యాయి. వీటిలో ఏ ఒక్క కాల్ నూ విస్మరించలేని పరిస్ధితి. దీంతో విమానాలకు బాంబు కాల్ వస్తుందంటే చాలు భయపడాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి.

ఇప్పటికే కేంద్రం ఇలాంటి విమానాల బెదిరింపు కాల్స్ పై నిఘా పెట్టింది. అంతే కాదు విమానాలకు ఫేక్ బాంబ్ బాల్స్ చేసి బెదిరిస్తే జైలుశిక్షలు తప్పవని, ఐదేళ్లపాటు ప్రయాణం చేయకుండా నిషేధం విధిస్తామని విమానయానశాఖ హెచ్చరికలు కూడా చేస్తోంది. అయినా బెదిరింపు కాల్స్ మాత్రం ఆగడం లేదు. వీటిలో చాలా మటుకు ఫేక్ కాల్సే ఉంటున్నాయి. అయినా వాటిని విస్మరించలేక అధికారులు హైరానా పడుతున్నారు.
In the last 30 minutes 6 aircraft from 3 Indian airlines have squawked 7700. This month, Indian airlines have been targeted by a large number of hoax bomb threats. pic.twitter.com/yhBslbUWU4
— Flightradar24 (@flightradar24) October 22, 2024












Click it and Unblock the Notifications