ఆయుధాలతో బెదిరించి 6 కేజీల బంగారం లూటీ
ఆగ్రా: వ్యాపారులను వెంబడించిన దుండగులు బంగారు నగలు లూటీ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వ్యాపారుల దగ్గర ఉన్న బంగారు నగలు లూటీ అయ్యాయని జిల్లా ఎస్పీ ఆర్ కే సింగ్ వివరించారు.
ఆగ్రాలో రింకు బన్సాల్, రాబిన్ బన్సాల్ సోదరులు నివాసం ఉంటున్నారు. వీరు బంగారు నగల షాప్ నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో వ్యాపారం ముగించుకున్నారు. షాప్ లో ఉన్న ఆరు కేజీల నగలు బ్యాగ్ లో పెట్టుకున్నారు.

తరువాత స్కూటర్ లో ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో బైక్ లలో వెంబడించిన దుండగులు బన్సాల్ సోదరులను అడ్డగించారు. తరువాత తుపాకులతో బెదిరించి వారి దగ్గర ఉన్న బంగారు నగలు ఉన్న బ్యాగ్ లాక్కోన్నారు.
అంతే కాకుండ వారి స్కూటర్ లాక్కోని అక్కడి నుండి పరారైనారు. బాధితులు ఫిర్యాదు చేశారని, బన్సాల్ సోదురుల గురించి పూర్తి వివరాలు తెలిసిన వారే నగలు లూటీ చేసి ఉంటారని జిల్లా ఎస్పీ ఆర్ కే. సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications