వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కాస్త తగ్గిన కరోనా ఉధృతి .. అయినా 40వేలకు పైనే కొత్త కేసులు ,199 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది . దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆందోళన నెలకొంది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తున్నాయి . నిన్నటి తో పోలిస్తే ఈరోజు కేసులు 13 శాతం మేర తగ్గినట్లుగా తెలుస్తోంది . గడచిన 24 గంటల్లో 40,715 కొత్త కేసులు నమోదు కాగా, 199మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్ .. ఢిల్లీలో మూడు రోజుల లాక్ డౌన్ కు ఆప్ సర్కార్ యోచన !!హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్ .. ఢిల్లీలో మూడు రోజుల లాక్ డౌన్ కు ఆప్ సర్కార్ యోచన !!

దేశంలో మొత్తం కరోనా కేసులు 1,16,87,796

దేశంలో మొత్తం కరోనా కేసులు 1,16,87,796

ఇక ఇప్పటివరకు మొత్తంగా1,16,87,796 కరోనా కేసులు నమోదు కాగా, మరణాలు 1.6 లక్షల మార్కును దాటినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక యాక్టివ్ కేసులు 2.8 శాతానికి పెరిగాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,45,377 కాగా 1.11 కోట్లమంది ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 29 వేల 785 మంది కరోనా నుండి కోలుకున్నట్లుగా తెలుస్తుంది.

మహారాష్ట్రలో కరోనా పంజా .. గత 24 గంటల్లో 24,645 కేసులు

మహారాష్ట్రలో కరోనా పంజా .. గత 24 గంటల్లో 24,645 కేసులు


ఇప్పటివరకు దేశంలో రికవరీ రేటు 95.75 శాతంగా ఉంది. ఇక మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో 24,645 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక మహారాష్ట్రలోనే 58 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో గుజరాత్లో 1640 కేసులు , చత్తీస్ గడ్ లో 1525 కేసులు మధ్యప్రదేశ్లో 1348 కేసులు, ఢిల్లీలో 888 కేసులు రాజస్థాన్లో 602 కేసులు తమిళనాడులో 1385 కేసులు నమోదయ్యాయి.

పెరుగుతున్న కేసులతో ఆందోళన .. కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనే కారణం

పెరుగుతున్న కేసులతో ఆందోళన .. కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనే కారణం

వివిధ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న తీరు
తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కరోనా ప్రోటోకాల్స్ ఉల్లంఘన కేసుల పెరుగుదలకు దారితీస్తుందని ప్రభుత్వం మరియు నిపుణులు చెప్పడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరిగి కఠిన ఆంక్షలను కొనసాగిస్తున్నారు. కేసుల పెరుగుదల ఇదే విధంగా ఉంటే లాక్ డౌన్ పెడతారేమో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.


ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్నటి వరకు కొనసాగిన వాక్సినేషన్ లో మొత్తంగా ఇప్పటివరకు 4,24 ,94 ,594 వ్యాక్సిన్ డోసులు అందించింది.

English summary
The corona second wave continues in India. However, today's cases seem to have decreased slightly compared to yesterday. Today's cases seem to have dropped by 13 percent compared to yesterday. In the past 24 hours, 40,715 new cases have been reported, with 199 deaths, according to official data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X