వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Smriti Irani: నా కూతుర్ని టార్గెట్ చేశారన్న స్మృతీ ఇరానీ-గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడానని..

|
Google Oneindia TeluguNews

గోవాలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కుమార్తె అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలు కలకలం రేపాయి. కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిప్పులు చెరిగారు. గాంధీలకు వ్యతిరేకంగా తాను మాట్లాడినందుకే కాంగ్రెస్ తనను టార్గెట్ చేసిందని ఆమె ఇవాళ ఆరోపించారు. స్మృతి ఇరానీ తన కూతురు గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

తాను ప్రజల కోర్టులో సమాధానాలు అడుగుతానని స్మృతీ ఇరానీ వెల్లడించారు. రాహుల్ గాంధీని మళ్లీ అమేథీకి పంపాలని కాంగ్రెస్ పార్టీకి ఆమె సవాల్ విసిరారు. ఫిర్ రాహుల్ గంగి కో ధూల్ చటేంగే (మళ్లీ రాహుల్ గాంధీని ఓడిస్తాను ) అని కేంద్ర మంత్రి అన్నారు. 18 ఏళ్ల యువతి పాత్ర హత్యకు ఇద్దరు మధ్య వయస్కులైన కాంగ్రెస్ వ్యక్తులు బాధ్యులని స్మతీ ఇరానీ ఆరోపించారు. తన ఏకైక తప్పు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గురించి మాట్లాడటమేనన్నారు. తన కుమార్తె కాలేజీలో చదువుతోందని, తాను ఆమె తల్లికావడమే తప్పని స్మృతీ తెలిపారు. తన కుమార్తె రాజకీయ నాయకురాలు కాదని, ఆమె విద్యార్థిగా సాధారణ జీవితాన్ని గడుపుతోందన్నారు.

smriti irani slams congress for goa bar allegations on daugter-bcoz talk against gandhis

తన కుమార్తె బార్ నడుపుతోందంటూ కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తున్న స్మృతీ ఇరానీ... వారిద్దరికీ ఇవాళ లీగల్ నోటీసులు పంపుతున్నారు. పవన్ ఖేరాను నా కూతురు కాలేజీలో చదువుతున్నారని ఆమె ఎలాంటి బార్‌ను నిర్వహించడం లేదని స్మృతీ తెలిపారు. దయచేసి పేపర్లు తనిఖీ చేయాలని కోరారు. నా కుమార్తె పేరు ఎక్కడ ఉందన్నారు. వారు సమాచార హక్కు (ఆర్‌టీఐ) ఆధారంగా నా కుమార్తెపై ఆరోపణలు చేస్తున్నారని స్మృతి ఇరానీ అన్నారు.

English summary
union minister smriti irani on today slams congress for their illegal in goa allegations on her daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X