ఐడియా : సమ్మర్ కూల్.. సోలార్ ఫ్యాన్.. గొడుగు కింద హాయిగా (వీడియో)
హైదరాబాద్ : ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఓ కంపెనీకి సంబంధించిన పాపులర్ యాడ్. అది వాస్తవికతకు దగ్గరగా ఉంది కాబట్టే ఫుల్ క్లిక్ అయింది. వాస్తవానికి ఓ ఐడియా.. మనిషిని మహార్షిలా మార్చేస్తుంది. సరిగ్గా అదే కోవకు వస్తారు ఓ పెద్దాయన. ఆయనకు వచ్చిన చిన్న ఐడియా.. అతనికి ఉక్కపోతను దూరం చేసింది. మండుటెండల్లోనూ, మిట్టమధ్యాహ్నం కూడా ఎంచక్కా బయటి ప్రదేశాల్లో తిరుగుతున్నారు.
సోలార్ ఫ్యాన్ అంబ్రెల్లా. అది తయారుచేయడమే ఆయనకు తట్టిన ఐడియా. సమ్మర్ బ్లాస్ట్ ను సమర్థవంతంగా తిప్పికొట్టేలా తనకు తాను ప్రయత్నం మొదలుపెట్టారు. గొడుగు లోపల చిన్నపాటి ఫ్యాన్ అమర్చి ఎండ వేడిమి నుంచి సేద తీరుతున్నారు. గొడుగు పైన సౌరశక్తిని గ్రహించేలా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. అది ఎండను గ్రహించి పవర్ ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. అలా వచ్చిన విద్యుత్ శక్తితో గొడుగు లోపలి ఫ్యాన్ ఎంచక్కా తిరుగుతోంది.

అలా తాను తయారుచేసుకున్న సోలార్ ఫ్యాన్ అంబ్రెల్లాతో.. ఎండ పూట కూడా ఎక్కడికంటే అక్కడకు వెళ్లిపోతున్నారు. అలా తన రోజూవారీ పనులను చక్కబెట్టుకుంటున్నారు. మిట్ట మధ్యాహ్నం వేళ కూడా ఎంచక్కా ఈ గొడుగు వేసుకుని బయట తిరుగుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ గొడుగుతో ఆ పెద్దాయన ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతుండటం విశేషం.
#FrugalInnovation to solve real problem.. #whatsappwonderbox pic.twitter.com/c0fSj3HrF8
— Shadakshari Swamy (@shadaksharis) May 1, 2019












Click it and Unblock the Notifications