వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలు, దళితులు మంత్రులు కావడం నచ్చడం లేదు: ప్రధాని మోడీ ఫైర్

|
Google Oneindia TeluguNews

అఖిలపక్ష సమావేశంలో చెప్పి.. వర్షకాల పార్లమెంట్ సమావేశాలకు కొద్దీసేపు ముందు చెప్పినా ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. సభా సజావుగా సాగనీయాలని ప్రధాని మోడీ కోరినా పెడచెవిన పెట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజునే ప్రతిపక్షాలు రచ్చ చేశాయి. కొత్త మంత్రులను సభకు ప్రధాని నరేంద్ర మోడీ పరిచయం చేసే క్రమంలో ప్రతిపక్ష ఎంపీలు నానా యాగీ చేశారు. మోడీ ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో ఆయప వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

Modi Cabinet Expansion : New Cabinet Ministers | PM Modi Cabinet 2.0 | Oneindia Telugu

మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు మంత్రులుగా అవకాశం రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మోడీ మండిపడ్డారు. వారు మంత్రులుగా ప్రమాణం చేయడాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంగా భావించాలని అన్నారు. కొత్త మంత్రుల్లో కొందరు రైతుల బిడ్డలు ఉన్నారని, మరికొందరు ఓబీసీ వర్గాలకు చెందిన వారని ఆయన చెప్పారు.

Some cant digest more women, SC/STs as ministers: PM Modi

రాజ్యసభలోనూ ప్రతిపక్షాల నుంచి అదేవిధంగా నిరసన ఎదురైంది. దీంతో గ్రామీణ ప్రాంతాల వారు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారు మంత్రులు కావడాన్ని గౌరవంగా భావించాలని ప్రధాని మోడీ అన్నారు. మహిళా వ్యతిరేక భావాలు ఉన్న కొందరు.. మహిళా మంత్రులను పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారని, పార్లమెంట్‌లో అలాంటి వారిని తానెప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు.

కొత్తగా మంత్రలైన వారి జాబితాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు అందజేశారు. వారి నియామకాన్ని సభలో నమోదు చేయాల్సిందిగా కోరారు. వారిని ఆమోదిస్తున్నట్టు ఉభయ సభలు ప్రకటించాయి. ప్ర‌ధాని మోడీ త‌న మంత్రిమండ‌లి ప్ర‌వేశ‌పెడుతున్న స‌మ‌యంలో విప‌క్షాలు అడ్డుకోవ‌డాన్ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌ప్పుప‌ట్టారు.

English summary
PM Modi stood up to introduce the newly inducted ministers who took oath on July 7 following a major rejig in the council of ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X