వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా అంటారా, పారికర్‌ని ఎవరైనా కంట్రోల్ చేయాలి: ఆంటోనీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యల పైన మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ గురువారం నాడు మండిపడ్డారు. పారికర్‌ను ఎవరైనా నియంత్రించాలని, ఆయన మాటలు కూడా చాలా బాధించాయని చెప్పారు.

గత ప్రభుత్వాల హయాంలో సర్జికల్ స్ట్రయిక్ దాడులు జరగలేదని పారికర్‌ చేసిన వ్యాఖ్యలను ఏకే ఆంటోని తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. దేశ సైన్యాన్ని, దేశాన్ని అవమానించేలా పారికర్‌ మాట్లాడారన్నారు.

కాగా, నిన్న మనోహర్ పారికర్ ముంబైలో మాట్లాడారు. గతంలో దాడులు జరిగిన తర్వాత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేవారని, సెప్టెంబర్ 29 సర్జికల్ స్ట్రయిక్ దాడులు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పారు.

ak antony

సరిహద్దు సేవలో జాగిలాలు

తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా దక్షిణ కాశ్మీరులోని ఓ మారుమూల గ్రామంలో సరిహద్దుల వద్ద భారతసైన్యంతో పాటూ ట్రాక్టర్, శామ్‌లనే రెండు జాగిలాలు విధినిర్వహణలో పాల్గొంటున్నాయి. రోట్‌వీలర్‌ జాతికి చెందిన ట్రాక్టర్, జర్మన్ షెపర్డ్‌ అయిన శామ్‌లు సైన్యంలోని రాష్ట్రీయ రైఫిల్స్‌ విభాగంలో సేవలందిస్తున్నాయి.

పేలుడు పదార్థాలను వాసనచూసి పసిగట్టి హెచ్చరించడం, అనుమానాస్పద కదలికలున్న సందర్భాల్లో అప్రమత్తం చేస్తాయి. జవాన్లందరికీ ట్రాక్టర్‌, శామ్‌లంటే చాలా ఇష్టం. హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాది బుర్హన్‌వాని, మరోఇద్దరు తీవ్రవాదులు హతమైన జులై 8 నాటి సైనిక చర్యలో ఈ జాగిలాలు తమ పాత్ర పోషించాయి.

English summary
Following Defence Minister Manohar Parrikar’s statement on Wednesday regarding surgical strikes conducted in the past, Congress leader and former Defence Minister AK Antony said “somebody must control him”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X