రద్దు ఎఫెక్ట్: చెత్తకుండీలో రూ.500, రూ.1000 నోట్ల కలకలం
పుణే: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో వింత వింత గాథలు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో నోట్లను కాల్చివేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అయితే వారు నోట్లు కాల్చివేయలేదు. కానీ చెత్తకుప్పలో వేశారు.
పుణేలో ఓ చెత్తకుండిలో రూ.500, రూ.1000 నోట్లు పడివుండటం స్థానికంగా కలకలం రేపాయి. రూ.52,000 విలువ చేసే నోట్లను పారిశుద్ధ్య కార్మికురాలు గుర్తించింది. ప్లాస్టిక్ కవర్లో చుట్టి డబ్బులు ఇక్కడ పడవేశారని చెప్పారు. పోలీసులకు సమాచారం అందించారు.

శాంతా ఓవహాల్ అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలు. గురువారం లా కాలేజీ రోడ్డులో విధులు నిర్వహిస్తుండగా డబ్బు దొరికింది. విషయాన్ని ఉన్నతాధికారికి చెప్పింది. వాళ్లు వచ్చి నోట్లను పరిశీలించి, ప్రభుత్వం రద్దు చేసిన నోట్లుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications