ఒకేసారి 400 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు అస్వస్థత... ఏం జరిగిందంటే...
విషపూరిత ఆహారం భూజించడం వల్ల కేరళ పల్లిపురంలోని సీఆర్పీఎఫ్ శిబిరానికి చెందిన 400 మంది జవాన్లు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
కేరళ: ఒకేసారి 400 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. విషపూరిత ఆహారం భూజించడం వల్ల ఈ ఘటన జరిగింది. కేరళ పల్లిపురంలోని సీఆర్పీఎఫ్ శిబిరానికి చెందిన జవాన్లు శనివారం చేపల కూర తిన్నారు.
ఆ ఆహారం విషపూరితం కావడంతో తిన్న జవాన్లు అందరూ వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురవగా అధికారులు వెంటనే వారిని త్రివేండ్రంలోని పలు ఆసుపత్రులకు తరలించారు.

110 మంది జవాన్లు తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జవాన్లకు అందిస్తోన్న ఆహారం నాసిరకంగా ఉంటోందంటూ గతంలో బీఎస్ఎఫ్ జవాన్లు, సీఆర్పీఎఫ్ జవాన్లు సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కేరళలో తాజాగా ఈ విషపూరిత ఆహారం ఉదంతం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని అస్వస్థతకు గురైన జవాన్లను పరామర్శించారు. ఈ ఘటనపై తక్షణం విచారణ చేపట్టాలని ఆయన సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications