సోమనాథుని సాక్షిగా 75 ఏళ్ల పండగ, విధ్వంసం నుంచి సృష్టి వైపు!
భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన సోమనాథ్ క్షేత్రం నేడు సరికొత్త చారిత్రక ఘట్టానికి వేదికైంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమ లింగమైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'సోమనాథ్ అమృత మహోత్సవ్' వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఈ పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఆయన, దేశాభివృద్ధిని కోరుతూ మహాదేవునికి 'విశేష్ మహా పూజ' నిర్వహించారు.
సోమనాథ్ ఆలయ ప్రస్థానాన్ని 'విధ్వంసం నుంచి సృష్టి'కి నిదర్శనంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. వెయ్యేళ్ల క్రితం ఈ ఆలయంపై జరిగిన దాడులను గుర్తు చేస్తూ.. ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, భారతీయుల విశ్వాసం మళ్లీ మళ్లీ ఈ ఆలయాన్ని నిర్మించిందని ఆయన కొనియాడారు. ఆలయానికి వెళ్లే ముందు గిర్ సోమనాథ్‌లో భారీ రోడ్‌షో నిర్వహించిన ప్రధాని, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన ఈ ఆలయ పునర్నిర్మాణ సంకల్పం నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం.

ఆకాశంలో 'సూర్య కిరణ్' విన్యాసాల శోభ
అరేబియా సముద్ర తీరాన ఉన్న సోమనాథ్ ఆలయ ప్రాంగణం భక్తితో పాటు దేశభక్తిని కూడా చాటిచెప్పింది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన 'సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్' ప్రదర్శించిన వాయు విన్యాసాలు యాత్రికులను ఉర్రూతలూగించాయి. ఆలయంపై నుంచి యుద్ధ విమానాలు కచ్చితమైన రూపాలు, వేగవంతమైన స్టంట్‌లతో ఆకాశాన్ని రంగులమయం చేశాయి. అమృత మహోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని సమక్షంలో నిర్వహించిన ఈ వాయు విన్యాసాలు భారత వైమానిక శక్తిని చాటిచెప్పాయి.
#WATCH | Gir Somnath, Gujarat: Indian Air Force's Surya Kiran Acrobatics team perform manoeuvres during the Somnath Amrut Mahotsav at the Somnath Temple, one of the twelve Jyotirlingas.
— ANI (@ANI) May 11, 2026
As part of the Somnath Amrut Mahotsav celebrations, Prime Minister Narendra Modi took part… pic.twitter.com/460BdvpIri
కుంభాభిషేకం.. ధ్వజారోహణం
ఆలయ ఆచారాల ప్రకారం సోమనాథునికి శాస్త్రోక్తంగా కుంభాభిషేకం నిర్వహించిన ప్రధాని, ఆ తర్వాత ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక వ్యాసాన్ని విడుదల చేస్తూ.. శతాబ్దాలుగా ఈ ఆలయాన్ని రక్షించి, పునర్నిర్మించిన మహనీయులకు నివాళులర్పించారు. సోమనాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, అది భారత నాగరికత యొక్క దృఢమైన సంకల్పానికి చిహ్నమని పేర్కొన్నారు.
#WATCH | Gir Somnath, Gujarat: Prime Minister Narendra Modi performs rituals as part of the Somnath Amrut Mahotsav at the Somnath Temple, one of the twelve Jyotirlingas.
— ANI (@ANI) May 11, 2026
Somnath Amrut Mahotsav marks 75 years since the inauguration of the restored Temple.
(Source:… pic.twitter.com/671p8xud83
వడోదరలో 'సర్దార్ ధామ్' ప్రారంభం
సోమనాథ్ పర్యటన అనంతరం ప్రధాని వడోదర చేరుకుని అక్కడ 'సర్దార్ ధామ్'ను ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు. భారతీయతను, సంస్కృతిని కాపాడుకోవడంలో సోమనాథ్ పోషించిన పాత్ర వెలకట్టలేనిదని, ఈ అమృత మహోత్సవం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని మోదీ ఆకాంక్షించారు.














Click it and Unblock the Notifications