హృదయ విదారకరం: తల్లిని చూసేందుకు వస్తే 14 రోజుల క్వారంటైన్‌, అంత్యక్రియలకు కూడా వెళ్లలేక..

ఆరోగ్యం బాగోలేని తల్లిని.. విడిచి వెళ్లడం తప్పలేదు. ఆమె పరిస్థితి విషమిస్తూ వస్తోంది. తనకు తల్లే ముఖ్యమని, ఉద్యోగం వద్దని విదేశం నుంచి రెక్కలు కట్టుకొని వస్తే.. క్వారంటైన్‌లో ఉంచారు. తనను చూసేందుకు వచ్చిన కుమారుడిని క్వారంటైన్‌లో ఉంచారని తెలిసి.. ఆ తల్లి హృదయం బరువెక్కింది. బిడ్డా.. బిడ్డా... అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బతికి ఉన్నప్పుడు చూడని తన తల్లిని.. చనిపోయాక అంత్యక్రియలకు కూడా హాజరుకాలేక తనలో తాను కుమిలి కుమిలి ఏడ్చాడు.

దుబాయ్ టు ఇండియా...

దుబాయ్ టు ఇండియా...

రాంపూర్‌కి చెందిన అమీర్ ఖాన్ (30) విదేబాలో ప్రొడక్ట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. గత ఆరేళ్లుగా అక్కడే ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే అతని తల్లికి ఆరోగ్యం బాగోలేదు. లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గతేడాది నవంబర్‌లో వ్యాధి బయటపడ్డ.. చికిత్స అందించడంతో బాగానే ఉన్నారు. కానీ తర్వాత పరిస్థితి క్రమంగా చేయిదాటిపోయింది. విషయం తెలిసిన అమీర్ ఖాన్.. వచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కానీ మార్చిలో లాక్ డౌన్ వల్ల అతను దుబాయ్‌లోనే చిక్కుకుపోయాడు. అక్కడ ఉండలేక, ఇండియా రాలేక మదనపడిపోయాడు.

అంత్యక్రియలకు కూడా..

అంత్యక్రియలకు కూడా..

లాక్ డౌన్ 4.0 సడలింపులతో ఈ నెల 13వ తేదీన ఢిల్లీకి చేరుకున్నాడు. ఇక్కడికి వచ్చాక అసలు సమస్య మొదలైంది. 14 రోజులు సొంత ఖర్చులతో క్వారంటైన్ ఉండాలని నిబంధన తీసుకొచ్చారు. అలా ఢిల్లీలోని హోటల్‌లో ఉంటోన్న క్రమంలో తల్లి ఆరోగ్యం మరింత క్షీణించింది. వాస్తవానికి తల్లి/తండ్రి ఆరోగ్యం బాగోలేకుంటే అధికారుల అనుమతి తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అతను చేసినా ప్రతీ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇంతలో అతని తల్లి చనిపోయిందనే విషయం తెలిసి వెక్కి వెక్కి మరీ ఏడ్డారు. శనివారం చనిపోగా.. ఆదివారం జరిగే అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని అధికారులను కోరారు. కానీ వారు క్వారంటైన్ పిరియడ్ ముగియాల్సిందేనని స్పష్టంచేశారు.

దక్కని కడసారి చూపు..

దక్కని కడసారి చూపు..


తన తల్లి చనిపోయిందని.. అంత్యక్రియలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని అధికారులను కోరానని.. అందుకు సంబంధించి దృవపత్రాలు కూడా అందజేశానని తెలిపారు. కానీ వారు తన మాటను లెక్కచేయలేదు అని వాపోయారు. తనలాంటి పరిస్థితి మరొకరికి రావొద్దు అని వేడుకుంటున్నారు. విదేశాల్లో ఉంటోన్న భారతీయులు.. దాదాపు 98 దేశాల నుంచి 2.59 లక్షల మంది భారతదేశం వచ్చేందుకు వందే భారత్ మిషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారు వచ్చేందుకు, విమానం దిగాక క్వారంటైన్‌లో ఉండేందుకు అనుమతి ఇచ్చాక మాత్రమే దేశానికి రావడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అలా అమీర్ ఖాన్ వచ్చారు. కానీ ఇంతలోనే వారి అమ్మ తిరిగిలాని లోకాలకు వెళ్లడం కలచివేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+