వెళ్లిపోయిన సోనియా, కాళ్లుమొక్కిన పొన్నం: వెల్లో చిరు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) పైన లోకసభలో చర్చ జరుగుతుండగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మధ్యలోనే వెళ్లిపోయారు. సవరణల పైన ఓటింగ్ జరుగుతుండగా ఆమె వెళ్లిపోయారు. ఈ సమయంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆమెకు పాదాభివందనం చేశారు.
వెల్లోకి చిరంజీవి, పురంధేశ్వరి
తెలంగాణ ముసాయిదా బిల్లులోని సవరణల పైన లోకసభలో చర్చ జరుగుతున్న సమయంలో కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు వెల్లోకి చొచ్చుకెళ్లి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, వెల్లోకి బిజెడి, శివసేన, ఏఐఏడిఎంకె, సిపిఎం తదితర పార్టీలో వచ్చి నిరసన తెలిపాయి. దాదాపు నలభై మంది సభ్యులు వెల్లోకి చొచ్చుకొచ్చారు.

ఇలాంటి పరిస్థితి నేను చూల్లేదు: శరద్ యాదవ్
నిరసనల మధ్య లోకసభ జరగడంపై జెడి(యు) అధ్యక్షులు శరద్ యాదవ్ స్పందించారు. ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడు సభలో చూడలేదన్నారు. అందుకే తాను బయటకు వెళ్లిపోతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్‌దే బాధ్యత: బండారు
సభను సజావుగా నడిపించాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీదేనని, దానిని స్రమంగా నిర్వర్తించలేకపోయిందని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా కలిసుందామన్నారు.
మండిపడ్డ చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications