మాట్లాడినందుకే మోడీగారు కేసు పెడతారంట యువరానర్.. అలా పెట్టొచ్చా?: సోనియా గాంధీ
పార్లమెంటు ఆమోదించిన చట్టం లేదా బిల్లుపై పౌరులు తెలియజేసే అభిప్రాయాలను అడ్డుకోవడం వాక్ స్వాతంత్య్ర హక్కును, ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించినట్లేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈమేరకు వారిరువురు ఢిల్లీ హైకోర్టుకు విడివిడిగా అఫిడవిట్లు సమర్పించారు.
2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు నేత విద్వేష ప్రసంగాలే కారణమంటూ ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ప్రసంగాలు చేసిన నేతల్లో సోనియా, రాహుల్ కూడా ఉన్నారనేది ప్రభుత్వ అభిప్రాయం.

తమపై కేసు నమోదు చేయాలని ఏ కోర్టూ ఆదేశించలేదని, సిట్‌ను నియమించాల్సిన అవసరం కూడా లేదని వీరిద్దరూ అభిప్రాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారిస్తోంది. కేసు తదుపరి విచారణ సెప్టెంబరు 27కు వాయిదా పడింది.
ప్రభుత్వం చేసే చట్టాలు, రూపొందించే బిల్లులపై ప్రజల్లో చర్చ జరిగేలా చేయడం, అందులో మార్పు చేర్పులను ప్రతిపాదించడం ప్రతిపక్ష పార్టీల ప్రాథమిక విధి అని సోనియాగాంధీ వెల్లడించారు. తాము మాట్లాడిన ప్రసంగాలవల్లే విద్వేషాలు జరిగాయని కోర్టు దృష్టికి తెస్తున్నారుకానీ అధికార పార్టీకి చెందిన నాయకులు చేసిన ప్రసంగాలను పిటిషనర్ కావాలనే కోర్టు దృష్టికి తీసుకురావడంలేదనే విషయాన్ని ధర్మాసనానికి తెలిపారు.












Click it and Unblock the Notifications