Sonia Gandhi ఆత్మకథ ఆగిపోయిందా? ‘పెంగ్విన్’ సంచలన ప్రకటన!

కాంగ్రెస్ సీనియర్ నేత, సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్' చుట్టూ గత కొద్దిరోజులుగా నడుస్తున్న వివాదానికి తెరపడింది. ఎడిటోరియల్ మార్పులను సోనియా గాంధీ తిరస్కరించడం వల్లే భారతదేశంలో ఈ పుస్తకాన్ని ప్రచురించకూడదని ప్రముఖ ప్రచురణ సంస్థ 'పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా' నిర్ణయించుకుందంటూ జోరుగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై పెంగ్విన్ సంస్థ శుక్రవారం స్పందిస్తూ పూర్తి వివరణ ఇచ్చింది. తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, భారత్‌లో ఈ పుస్తకానికి తాము ప్రచురణకర్తలం కాదని స్పష్టం చేసింది.

'సవరణలు కోరడం మా బాధ్యతే'.. అసలేం జరిగింది?

పుస్తకాల్లో ఉండే నిజా నిజాలను ఫ్యాక్ట్ చెకింగ్, అవసరమైన మార్పులు సూచించడం ప్రచురణ ప్రక్రియలో ఒక సాధారణ భాగమని పెంగ్విన్ సంస్థ వ్యాఖ్యానించింది. రచయితలకు మంచి సలహాలు ఇవ్వడం పబ్లిషర్‌గా తమ బాధ్యతని పేర్కొంది. సోనియా గాంధీ పుస్తకాన్ని ప్రచురించడానికి తాము ఇప్పటికీ ఎంతో ఆసక్తితో ఉన్నామని, అయితే ఎడిటోరియల్ మార్పుల కారణంతోనే పుస్తకం ఆగిపోయిందనడం వాస్తవం కాదని స్పష్టం చేసింది. రచయితతో జరిగిన అంతర్గత చర్చల వివరాలను బయటకు వెల్లడించలేమని చెబుతూ, భారత్‌లో ఈ ఆత్మకథ ప్రచురణపై ఉన్న అపోహలకు ముగింపు పలికింది.

Sonia Gandhi Memoir Belonging Penguin India Clarifies Stand Amid Editorial Controversy Reports

ఇటలీ నుంచి భారత్ దాకా.. ప్రయాణమంతా ఒక కావ్యమే!

ప్రస్తుతం 79 ఏళ్ల వయస్సున్న సోనియా గాంధీ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ ఆత్మకథపై దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. రెండవ ప్రపంచ యుద్ధం తదనంతరం ఇటలీలో గడిపిన చిన్నతనం, 1965లో కేంబ్రిడ్జ్‌లో చదువుకునే రోజుల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ఏర్పడిన పరిచయం, ప్రేమ, పెళ్లి వరకు అన్ని విషయాలను ఇందులో ప్రస్తావించారు.

సోనియా గాంధీ విశ్వరూపం: మోడీ అసలు ప్లాన్ బట్టబయలు!
సోనియా గాంధీ విశ్వరూపం: మోడీ అసలు ప్లాన్ బట్టబయలు!

అంతేకాకుండా.. అత్తగారు ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ దారుణ హత్యలకు గురైన తరుణంలో తాను అనుభవించిన తీవ్ర వేదనను, ఆ తర్వాత భారత్‌ను తన సొంత దేశంగా మార్చుకున్న తీరును సోనియా గాంధీ ఈ పుస్తకంలో ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరించారు. ఇటీవల రాజీవ్ గాంధీ జయంతి సందర్భంలో రాహుల్ గాంధీ కూడా ఈ పుస్తకంపై స్పందిస్తూ తన తల్లి జ్ఞాపకాలను ప్రపంచం చదవబోతుండటం ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు.

సోనియా గాంధీ ఎడిటోరియల్ ఒపీనియన్- కేంద్రాన్ని ఏకిపారేశారు.. !!
సోనియా గాంధీ ఎడిటోరియల్ ఒపీనియన్- కేంద్రాన్ని ఏకిపారేశారు.. !!

ఇంతకీ భారత్‌లో ఈ పుస్తకం వచ్చేదెప్పుడు?

అంతర్జాతీయంగా సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'ను నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రముఖ గ్లోబల్ పబ్లిషర్ ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్ ఇప్పటికే ప్రకటించింది. ఇది కూడా పెంగ్విన్ రాండమ్ హౌస్ గ్రూప్‌నకు చెందిన సంస్థే అయినప్పటికీ, భారత్‌లోని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా మాత్రం దీనికి దూరంగా ఉంది. ఇప్పుడు భారత్‌లో ఈ పుస్తకం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఏ ప్రచురణ సంస్థ ద్వారా భారతీయ పాఠకుల ముందుకు రానుంది? అనే అంశంపై మార్కెట్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+