6 గంటలు: రెండోరోజు ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ, రేపు రావాలని ఆదేశం
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ రెండో రోజు విచారించింది. మంగళవారం 6 గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నలు వేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఒకసారి సోనియా గాంధీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా వెంట రాగా సోనియా గాంధీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అయితే రేపు కూడా రావాలని ఈడీ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

6 గంటలు విచారణ..
సోనియాను మధ్యాహ్నం దాకా విచారించారు. మధ్యాహ్న భోజన విరామం ఇచ్చి..తర్వాత విచారణ కొనసాగించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్‌పై ప్రశ్నలు వేశారు. సాయంత్రం 6 గంటల దాకా విచారణ కొనసాగింది. 6 గంటల సమయంలో విచారణ ముగిసిందని అధికారులు తెలిపారు. దీంతో సోనియా గాంధీ ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

నిధులు దుర్వినియోగం..
నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కంపెనీని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై 2012 నవంబరు 1వ తేదీన ఢిల్లీలో గల కోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేటు కేసు దాఖలు చేశారు. మోసానికి పాల్పడ్డారని, ఏజేఎల్‌కు చెందిన వేల కోట్ల విలువ చేసే భూములను కాజేశారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఢిల్లీ, యూపీ తదితర ప్రాంతాల్లో ఏజేఎల్‌కు ఉన్న రూ.1,600 కోట్ల విలువైన ఆస్తులను వారు యజమానులుగా ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా దక్కించుకున్నారని ఆరోపించారు.

ఆస్తులు అద్దెకు
స్వాతంత్యానికి ముందు 5 వేల మంది స్వాతంత్య్ర సమరయోధుల నుంచి నెహ్రూ నిధులు సమీకరించి ఏజేఎల్‌ను ఏర్పాటు చేశారు. 5 వేల మంది ఈ కంపెనీకి షేర్ హోల్డర్లుగా ఉండేవారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో ఇంగ్లీష్ వార్తాపత్రిక ప్రచురణను 1938లో ప్రారంభించారు. హిందీలో నవజీవన్, ఉర్దూలో ఖౌమీ ఆవాజ్ ప్రతికలను ఏజేఎల్ ప్రచురించింది. ఏజేఎల్ నష్టాల్లో ఉందంటూ నేషనల్ హెరాల్డ్ సహా ఆ సంస్థకు చెందిన అన్ని పత్రికల ముద్రణను 2008 ఏప్రిల్‌లో నిలిపివేశారు. ఆ సంస్థ ఆస్తులను అద్దెకు ఇచ్చేందుకు కూడా అనుమతిచ్చారు.

ఇవీ ఆస్తులు
2010 సెప్టెంబరు 1న లక్నోలోని ఏజేఎల్ కార్యాలయాన్ని ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్‌లోకి తరలించారు. ఏజేఎల్‌కు ఎప్పటికప్పుడు ఏఐసీసీ రుణాలు ఇచ్చింది. 2010 డిసెంబరు 16 నాటికి రూ.90.21 కోట్లకు చేరాయి. రుణ బకాయిలను, ఏజేఎల్‌కు చెందిన 99.99 శాతం షేర్లను యంగ్ ఇండియన్‌కు ఏఐసీసీ బదలాయించింది. ప్రతిగా యంగ్ ఇండియన్ కంపెనీ రూ.50 లక్షలు చెల్లించింది. అంతకు మూడు రోజుల ముందే యంగ్ ఇండియన్ కంపెనీ తొలి మేనేజింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, రాహుల్ గాంధీని డైరెక్టర్‌గా నియమించారు. ఏజేఎల్ రియల్ ఎస్టేట్ విలువను రూ.5 వేల కోట్లుగా అంచనా వేశారు. ఆ సంస్థకు హెరాల్డ్ హౌస్ పేరుతో ఢిల్లీలో 10,000 చదరపు మీటర్ల స్థలంలో 6 అంతస్థుల భవనం ఉంది. దీంతోపాటు లక్నో, భోపాల్, ముంబై, ఇండోర్, పట్నా, పంచకుల తదితర ప్రాంతాల్లోనూ ఆ సంస్థకు ఆస్తులు ఉన్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications