కొత్తదనం లేదు: ప్రధాని మోడీ ప్రసంగంపై సోనియా గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. మోదీ ప్రసంగంలో కొత్తదనం లేదన్నారు. ఎప్పటిలాగే ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాల గురించి మోడీ ప్రస్తావించలేదని చెప్పారు.
Recommended Video

Modi Speech In Lok Sabha Over AP Bifurcation
తమ భవిష్యత్తుపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. దేశ ప్రజలు ఉపాధిని కోరుకుంటున్నారని, ఇలాంటి ఉపన్యాసాలు కాదని చెప్పారు.

తమకు ప్రసంగాలు వద్దని, ఉద్యోగాలు కావాలని, రాఫెల్ అంశంపై మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని, ఆయనది రాజకీయ ప్రసంగమని అంతకుముందు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ప్రధాని ప్రసంగం అనంతరం లోకసభ మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. మోడీ ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు వీరప్ప మొయిలీ విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన ప్రసంగాన్ని బిజెపి సభ్యులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications