మాకే లాభం!: సోనియాకు కోపమొచ్చింది, ఎంపీ 'సారీ'
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిప్పులు చెరిగారు. రాజకీయ దురుద్దేశ్యంతో ఐటీ నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఇలాంటి చర్యలతో తాము త్వరగా పుంజుకునే అవకాశముందన్నారు. కక్ష సాధింపు చర్యలతో తమను భయపెట్టలేరని సోనియా ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్ అంశంలో ఐటి నోటీసుల పైన సోనియా స్పందించారు. ఆదాయపన్ను శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామని సోనియా చెప్పారు. తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
టీఎంసీ ఎంపీ క్షమాపణ
లోకసభ సభాపతి సుమిత్రా మహాజన్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ క్షమాపణలు చెప్పారు. రైల్వే బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌కు అన్యాయం జరిగిదంటూ లోకసభ కార్యకలాపాలను టీఎంసీ ఎంపీలు అడ్డుకున్నారు.

పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు వ్యతిరేకంగా కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీరు బీజేపీ స్పీకర్ కాదని, నరేంద్ర మోడీ స్పీకర్ కాదని వ్యాఖ్యానించారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యల పైన బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.
అంతేకాకుండా రైల్వే బడ్జెట్ సందర్భంగా లోకసభలో బీజేపీ ఎంపీ ఒకరు మద్యం తాగి వచ్చి అల్లరి చేశారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. ఈ రోజు ఆయన క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications