ఎమర్జెన్సీ పెట్టాలని చూసిన సోనియా: స్వామి బాంబు
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా ఎమర్జెన్సీ పెట్టేందుకు ప్రయత్నించారని, కానీ సైన్యం సహకరించలేదని ఆయన బాంబు పేల్చారు.
2011-12 ప్రాంతంలో సోనియా ఆ ప్రయత్నం చేశారన్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి 41 సంవత్సరాలైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా ప్రయత్నాలను సైన్యం అడ్డుకుందన్నారు. అప్పటి ఆర్మీ జనరల్ వీకే సింగ్, తాము సహకరించబోమని స్పష్టం చేయడంతోనే సోనియా వెనకడుగు వేశారన్నారు.
హిందుత్వ తీవ్రవాద గ్రూపులను సాకుగా చూపిస్తూ.. సోనియా ఎమర్జెన్సీ ప్రకటించాలని భావించారన్నారు. అయోధ్య అంశంపై మాట్లాడుతూ... మొఘల్ పాలనలో వేలాది హిందూ దేవాలయాలు సర్వ నాశనమైనాయని, అయోధ్య, కాశీ, మధురల్లో గుడులు నిర్మించుకునేందుకు ముస్లింలు సహకరించాలన్నారు.

అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించుకునేందుకు సరయూ నది ఒడ్డున భూమిని ఇస్తామన్నారు. ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో విచారణ జరిపితే.. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం జైలుకు పోవడం ఖాయమన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఊచలు లెక్కించాల్సిందేనన్నారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా ఎమర్జెన్సీ పెట్టేందుకు ప్రయత్నించారని, కానీ సైన్యం సహకరించలేదని ఆయన బాంబు పేల్చారు.












Click it and Unblock the Notifications