వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాగాంధీని ఢీ కొట్టిన ధీర వనిత..జాతీయతను ప్రశ్నించిన ఉక్కు మహిళ

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఉక్కు మహిళ సుష్మాస్వరాజ్ రాజకీయ ప్రస్థానం ! || Sonia Gandhi vs Sushma Swaraj || Oneindia Telugu

న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూయడం పట్ల యావత్ భారత దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కన్నుమూసిన విషయం తెలిసిన వెంటనే దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు. ఎన్డీఏ-1 హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మాస్వరాజ్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. విదేశాల్లో భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, పొరుగు దేశ ప్రజలు ప్రాణాంతక రోగాల బారిన పడి మన దేశంలో వైద్యం చేయించుకోవాలనుకున్నా.. సుష్మా స్వరాజ్ వైపు చూపులు సారించే వారు. తమను ఆదుకోవాల్సిందిగా అర్థించేవారు. పాకిస్తానీయులను సైతం వైద్య చికిత్సల కోసం అత్యవసరంగా భారత్ కు రప్పించిన సహృదయం, దయార్ధ్ర హృదయం సుష్మా స్వరాజ్ ది.

ఆర్ఎస్ఎస్ నేపథ్యం గల కుటుంబం నుంచి..

సుష్మా స్వరాజ్ స్వతహాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి హర్ దేవ్ శర్మ ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా ఉండేవారు. సంఘ్ సంచాలక్ స్థాయిలో పనిచేశారు. 1953 ఫిబ్రవరి 14వ తేదీన సుష్మాస్వరాజ్ హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ లో జన్మించారు. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక కార్యకర్తగా తండ్రి అడుగుజాడల్లో నడిచారు. స్థానికంగా సనాతన ధర్మ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. సంస్కృతం అంటే సుష్మాస్వరాజ్ కు పంచప్రాణాలు. ఆ భాషలోనే ఆమె తన డిగ్రీని పూర్తి చేయడం విశేషం. పంజాబ్ యూనివర్శిటీ నుంచి పట్టా అందుకున్నారు. హిందీ భాషలో పంజాబ్ యూనివర్శిటీ నిర్వహించిన పోటీల్లో వరుసగా మూడుసార్లు అత్యుత్తమ వక్తగా అవార్డులను అందుకున్నారు.

ఆర్ఎస్ఎస్ నేపథ్యం గల కుటుంబం నుంచి..

ఆర్ఎస్ఎస్ నేపథ్యం గల కుటుంబం నుంచి..

సుష్మా స్వరాజ్ స్వతహాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి హర్ దేవ్ శర్మ ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా ఉండేవారు. సంఘ్ సంచాలక్ స్థాయిలో పనిచేశారు. 1953 ఫిబ్రవరి 14వ తేదీన సుష్మాస్వరాజ్ హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ లో జన్మించారు. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక కార్యకర్తగా తండ్రి అడుగుజాడల్లో నడిచారు. స్థానికంగా సనాతన ధర్మ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. సంస్కృతం అంటే సుష్మాస్వరాజ్ కు పంచప్రాణాలు. ఆ భాషలోనే ఆమె తన డిగ్రీని పూర్తి చేయడం విశేషం. పంజాబ్ యూనివర్శిటీ నుంచి పట్టా అందుకున్నారు. హిందీ భాషలో పంజాబ్ యూనివర్శిటీ నిర్వహించిన పోటీల్లో వరుసగా మూడుసార్లు అత్యుత్తమ వక్తగా అవార్డులను అందుకున్నారు.

25 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా..

25 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా..

పాతికేళ్ల వయస్సులోనే సుష్మాస్వరాజ్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ఓ సంచలనం. 1977లో హర్యానా అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో ఆమె జనతాపార్టీ అభ్యర్థిగా అంబాలా కంటోన్మెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. ముఖ్యమంత్రి దేవీలాల్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇక అప్పటి నుంచి రాజకీయాల్లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఆమె రాజకీయ ప్రస్థానం తిరుగులేని విధంగా సాగింది. రాజకీయాల్లో అడుగు పెట్టిన సరిగ్గా 20 సంవత్సరాల తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అందుకునే స్థాయికి ఎదిగారు. మూడు నెలలు మాత్రమే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి స్థానంలో కొనసాగారు.

సోనియా జాతీయతను ప్రశ్నించిన మొదటి మహిళ

సోనియా జాతీయతను ప్రశ్నించిన మొదటి మహిళ

యూపీఏ ఛైర్ పర్సన్ గా 2004 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సోనియా గాంధీ జాతీయతను ప్రశ్నించిన మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందారు సుష్మా స్వరాజ్. ఓ రకంగా చెప్పాలంటే- సోనియా గాంధీ ప్రధానమంత్రి పగ్గాలను అందుకోలేకపోవడానికి సుష్మా స్వరాజ్ ప్రధాన కారణం. ఓ విదేశీయురాలు, ఓ ఇటలీ మహిళ భారత ప్రధానమంత్రిగా నియమితులైతే తాను, శిరోముండనం చేయించుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. దీనితో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. లోక్ సభలో తిరుగులేని మెజారిటీని సాధించినప్పటికీ.. సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం మన్మోహన్ సింగ్ కు పాలనా పగ్గాలను అందించిన విషయం తెలిసిందే.

బళ్లారిలో పోటాపోటీ..

బళ్లారిలో పోటాపోటీ..

1999 లోక్ సభ ఎన్నికల్లో సోనియాగాంధీ కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేశారు. సోనియాను ఢీ కొడుతూ తాను కూడా అదే నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ 56 వేల ఓట్ల తేడాతో సోనియాగాంధీ చేతిలో పరాజయం చవి చూశారు. అయినప్పటికీ.. ఆ వెంటనే ఆమెను రాజ్యసభ సభ్యత్వం వరించింది. అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో పనిచేశారు.

విదిష దీదీగా గుర్తింపు..

విదిష దీదీగా గుర్తింపు..

అనంతరం సుష్మాస్వరాజ్ మధ్యప్రదేశ్ లోని విదిష లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించారు. క్రమంగా ఆ స్థానాన్ని ఆమె బీజేపీకి కంచుకోటగా మార్చివేశారు. 15వ లోక్ సభలో ఆమె ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టారు. ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. 2014లో బీజేపీ అధికారాన్ని అందుకుంది. నరేంద్ర మోడీ క్యాబినెట్ లో విదేశాంగ మంత్రిత్వశాఖ పగ్గాలను అందుకున్నారు. ఇందిరాగాంధీ తరువాత ఓ మహిళ విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులు కావడం అదే తొలిసారి. విదేశాంగ శాఖ మంత్రిగా ఆమె సుష్మాస్వరాజ్ చేసిన సేవలను పాకిస్తానీయులు సైతం ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కడ భారతీయులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇచ్చేవారు. ట్విట్టర్ లో అత్యంత యాక్టివ్ గా ఉండే మంత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులను అప్రమత్తం చేసేవారు.

English summary
Sushma Swaraj is no more, most powerful and senior women in Indian politics, but Sushma Swaraj and Sonia Gandhi, have always had a rocky relationship, although they come from two ends of the political spectrum,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X