ఫ్రెండ్స్ కలిశారు!: సోనియాకు చెరోవైపు లాలు, శరద్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. గత మూడేళ్లలో తొలిసారిగా సోనియా ఇచ్చిన ఈ విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్, జెడి(యూ) అధినేత శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. సోనియా కూర్చున్న టేబుల్ వద్దే లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్‌లు కూర్చోవడం గమనార్హం.

రాహుల్ గాంధీ ఇతర దేశాల దౌత్యవేత్తలతో కలిసి కూర్చుంటే మన్మోహన్ సింగ్ మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషి, సినీ నటి షర్మిలా టాగూర్ తదితరులతో కూర్చున్నారు. తన టేబుల్ వద్ద కూర్చోవాలని మన్మోహన్ సింగ్‌ను సోనియా కోరినప్పటికీ ఆయన మాత్రం తనకు కేటాయించిన సీట్లోనే కూర్చున్నారు. విందు పైన కాంగ్రెస్ స్పందిస్తూ.. ఫ్రెండ్‌షిప్ కాదని, ఓ కుటుంబ సభ్యులుగా సోనియా విందు ఇచ్చారని పేర్కొంది.

అశోకా హోటల్‌లో ఇచ్చిన ఈ విందుకు గులాం నబీ అజాద్, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ రాజ్ బబ్బర్, అజహరుద్దీన్, మణిశంకర్ అయ్యర్ తదితర కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు మతపెద్దలు, పాత్రికేయులు హాజరయ్యారు. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యాన్ని చవిచూసిన నేపథ్యంలో లాలూ ఆర్జేడీకి, జేడీయుకు చేరువయ్యే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. బీహార్లోను బీజేపీని ఎదుర్కొనేందుకు జేడీ(యు), ఆర్జేడీ కలిసేందుకు సిద్ధమవుతున్నాయి.

మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు వస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన వెనకాల ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ హోటల్లో ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ టోపీతో కనిపించిన దృశ్యం.

 సోనియా, లాలూ

సోనియా, లాలూ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ ఓ వైపు, జేడీయు అధ్యక్షులు శరద్ యాదవ్ కూర్చున్నారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. విందులో తింటున్న సోనియా గాంధీ.

సోనియా, లాలూ

సోనియా, లాలూ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ ఓ వైపు, జేడీయు అధ్యక్షులు శరద్ యాదవ్ కూర్చున్నారు. సోనియాకు లాలూ ఖర్జూరలు ఇస్తున్న దృశ్యం.

లాలూ, రబ్రీ

లాలూ, రబ్రీ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ ఆయన సతీమణి రబ్రీదేవీ.

 మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు వస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన వెనకాల ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+