సెక్స్ రాకెట్ ఆపరేటర్ సోను పంజాబన్‌కు కఠిన కారాగార శిక్ష, ఆమెకు 24 ఏళ్లు, సహాయకుడికి 20 ఏళ్లు..

చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధిస్తోన్న సెక్స్ రాకెట్ ఆపరేటర్ సోనూ పంజాబన్‌కు స్థానిక ఢిల్లీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. 24 ఏళ్ల శిక్ష విధిస్తూ ద్వారకా జిల్లా కోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ఆమె సహాయకుడు సందీప్‌కు కూడా 20 ఏళ్ల శిక్ష విధించింది. చిన్న పిల్లలను సోను ట్రాఫికింగ్ చేయగా.. సందీప్ లైంగికదాడి చేసి పైశాచిక ఆనందం పొందేవాడు. వీరి బారి నుంచి ఓ 12 ఏళ్ల చిన్నారి తప్పించుకోవడంతో ..అలా వీరి చీకటి కోణం ప్రపంచానికి వెలుగుచూసింది.

లిమిట్స్ క్రాస్..

లిమిట్స్ క్రాస్..

వ్యభిచార కూపం నుంచి బయటపడ్డ 12 ఏళ్ల చిన్నారికి పరిహారంగా 7 లక్షల నగదు కూడా అందజేయాలని మేజిస్ట్రేట్ తీర్పులో తెలిపారు. లైంగిక వేధింపుల కేసులో తీహార్ జైలులో సోనూ, సందీప్ ఉన్నారు. అయితే సోనూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. అక్కడే చికిత్స తీసుకోవడంతో ఆరోగ్యం మెరుగుపడింది. అయితే సోను తనకు ఇచ్చిన పరిమితులను దాటి పోయారని, ఓ మహిళ అని కూడా మరచిపోయి ప్రవర్తించారని జడ్డీ పేర్కొన్నారు.

2017లో సోను అరెస్ట్..

2017లో సోను అరెస్ట్..

2014లో నజఫ్‌ఘడ్ పోలీసు స్టేషన్‌లో సోనుపై కేసు నమోదైంది. సోను ఆమె అనుచరులు మైనర్ బాలికల చేత బలవంతంగా వ్యభించారం చేయిస్తున్నారని కేసు నమోదు చేశారు. తర్వాత కేసును క్రైం బ్రాంచ్ టెకాప్ చేసింది. చివరికీ 2017లో సోను, సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Recommended Video

    Delhi Rains: Watch Building Collapsed | Minto Bridge కిందుగా కొట్టుకొచ్చిన మృతదేహం || Oneindia
    2011లో కూడా అదుపులోకి..

    2011లో కూడా అదుపులోకి..

    సోనుపై ఇప్పుడేకాదు 2014లో కూడా సెక్స్ రాకెట్ కేసులో ఢిల్లీ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే సరైన ఆధారాలు నిరూపించకపోవడంతో ఆమె నిర్దోషిగా విడులయ్యారు. 2011లో సోను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. మొహ్రౌలిలో ఆమె నలుగురి అనుచరులను కూడా అరెస్ట్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+