వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోను సూద్ సంచలనం : ఐటీ దాడుల వెనుక ఎవరున్నారో తెలుసు; అలా ఏ పార్టీ ఆహ్వానించినా వెళ్తా !!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి సమయములో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న సోను సూద్ ఆస్తులపై ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలలో 20 కోట్ల రూపాయలకు పైగా ఆదాయపు పన్ను ఎగ్గొట్టారు అని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సూద్ ఆస్తులపై ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. సోనూసూద్ ముంబైలోని నివాసంతో పాటు, మొత్తం సోనూసూద్ కి సంబంధించిన ఇరవై ఎనిమిది చోట్ల జరిపిన తనిఖీలలో అనేక తప్పుడు ఎంట్రీలను చూశామని ఐటీ శాఖ పేర్కొంది. దాదాపు 20కి పైగా తప్పుడు ఎంట్రీలను లెక్కల్లో గుర్తించామని పేర్కొన్న ఐటీ శాఖ దీనిపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది.

ఆ సోదాల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు : సోను సూద్

ఆ సోదాల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు : సోను సూద్

ఐటీ తనిఖీల వ్యవహారంపై మరోమారు స్పందించిన సోనూసూద్ తన ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తాను నమ్ముతానని పేర్కొన్న సోనూసూద్ తన ఫౌండేషన్ కు విరాళాల రూపంలో వచ్చిన డబ్బుల నుంచి ఒక్క పైసా కూడా వృధా చేయలేదని స్పష్టం చేశారు. ఇక సేవా కార్యక్రమాల కోసం తాను ఖర్చు చేసిన డబ్బుల్లో విరాళం నుండి వచ్చిన డబ్బు కంటే, తన సొంత రెమ్యూనరేషన్ ఎక్కువ ఉందని ఆయన పేర్కొన్నారు.

 రాజకీయ పార్టీల పట్ల అభిప్రాయం చెప్పిన సోను సూద్

రాజకీయ పార్టీల పట్ల అభిప్రాయం చెప్పిన సోను సూద్

అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అంశంపై మాట్లాడిన సోను సూద్ దేశ్ కి మెంటార్ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకునేందుకు తనను డిల్లీ ప్రభుత్వం ఆహ్వానించింది అని, ప్రజల ముఖాల్లో ఆనందం నింపడానికి తనను ఎవరు పిలిచినా వెళ్తానని సోనూసూద్ పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించిన ఢిల్లీ ప్రభుత్వమా .. గుజరాత్ ప్రభుత్వమా .. బీహార్ ప్రభుత్వమా అనేది చూడకుండా వెళ్తానని రాజకీయ పార్టీల పట్ల తన అభిప్రాయాన్ని తన వ్యాఖ్యల ద్వారా కుండబద్దలు కొట్టారు.

 సూద్ చారిటీ విరాళాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సోను సూద్

సూద్ చారిటీ విరాళాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సోను సూద్

సూద్ చారిటీ ఫౌండేషన్ లో 18.9 4 కోట్ల విరాళాలపై మాట్లాడిన సోనూసూద్ ఆయన చారిటీలో భారీగా నగదు ఉందన్న ఆరోపణలపై స్పందించారు. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ కు సంబంధించిన డబ్బులు 1.9 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని, ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. 18 కోట్లు ఖర్చు పెట్టడానికి 18 నిమిషాలు చాలని పేర్కొన్న సోనూసూద్ తన దృష్టికి ఎవరు ఎలాంటి సమస్యలు తీసుకువచ్చినా అవి వాస్తవమా కాదా అన్నది పరిశీలించి, క్షేత్రస్థాయి వర్గాలను ఆరా తీసి సహాయం చేస్తున్నామన్నారు . విరాళాలలో ఏమీ వృధా కాలేదని ఆయన స్పష్టం చేశారు.

తన ఫౌండేషన్ ఎఫ్ సి ఆర్ ఏ క్రిందకు రాదన్న సోను సూద్

తన ఫౌండేషన్ ఎఫ్ సి ఆర్ ఏ క్రిందకు రాదన్న సోను సూద్

అంతే కాదు విరాళాలన్నీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫామ్ లోనే ఉన్నాయని తన ఫౌండేషన్ ఎఫ్ సి ఆర్ ఏ కిందికి రాదని పేర్కొన్నారు. తాను విదేశాల నుండి ఒక్క పైసా కూడా విరాళంగా తీసుకోలేదని పేర్కొన్న ఆయన విదేశీయులు ఇచ్చిన విరాళాల నిధులు భారత్ కు వచ్చినప్పుడే కదా ఉల్లంఘన జరిగిందా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యేది అన్నారు. అయితే ఆ డబ్బు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ నుండే నేరుగా అవసరం ఉన్న వారికే చేరుతుందని సోను సూద్ వివరించారు. ముందు ముందు సోనూసూద్ లేకపోయినా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్న ఆయన ఐటి అధికారులు అవకతవకలు జరిగాయని చెప్పిన ప్రతి ఒక్క దానికి సోను సూద్ తనదైన సమాధానమిచ్చారు.

ఇన్ఫ్రా కంపెనీతో డీల్ పై మాట్లాడిన సోను సూద్

ఇన్ఫ్రా కంపెనీతో డీల్ పై మాట్లాడిన సోను సూద్

ఇటీవల సోనూసూద్ ఒప్పందం చేసుకున్న లక్నోలోని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో 65 కోట్ల విలువచేసే బోగస్ రసీదులను కనుగొన్నారని ఐటీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. సదరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 175 కోట్ల సందేహాస్పద లావాదేవీలను జరిపిందని, సోనూసూద్ కు ఈ కంపెనీకి లింకు పెడుతూ ఆరోపణలు వెల్లువగా మారగా దీనిపై కూడా మాట్లాడిన సోనుసూద్ ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఆ కంపెనీతో కలిసి పని చేయడానికి ఒక ఒప్పందాన్ని మాత్రమే చేసుకున్నానని, ఆ ఒప్పందాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఇచ్చానని వెల్లడించారు. మొత్తానికి సోనూసూద్ తన ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగానే ఉన్నాయని, కానీ ఐటీ సోదాలు కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఎగవేసిన ట్లుగా చెప్పడం వెనుక ఎవరు ఉన్నారో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

 సోను సూద్ ఆస్తులపై ఐటీ సోదాలపై బీజేపీని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు

సోను సూద్ ఆస్తులపై ఐటీ సోదాలపై బీజేపీని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు


సోనుసూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయిన తర్వాత, వచ్చే సంవత్సరం జరుగనున్న పంజాబ్ సార్వత్రిక ఎన్నికలలో రాజకీయాల్లోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా దేశం దృష్టి సోనూసూద్ పై పడింది. ఈక్రమంలో తర్వాత జరిగిన పరిణామాలలో భాగంగా సోను సూద్ పై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు జరపడం దేశ రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. బిజెపి వెనకుండి కేంద్ర సంస్థతో సోనూసూద్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని, తనకు అనుకూలంగా లేని వారిని బీజేపీ టార్గెట్ చేస్తుందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన లు సోను సూద్ వ్యవహారంలో బిజెపి సర్కార్ ను టార్గెట్ చేస్తూ ద్వజమెత్తారు. విమర్శల వర్షం కురిపించారు.

English summary
Reacting to the IT searches, Sonu Sood bluntly said that everyone knew who was behind the IT department searches in his house and clarified that he had not wasted a single penny of the money of donations to his foundation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X